Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది-oil palm cultivation in telangana brings huge income to farmers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Dec 17, 2024, 07:46 AM IST Basani Shiva Kumar
Dec 17, 2024, 07:46 AM , IST

  • Oil Palm Cultivation : డబ్బులు చెట్లకు కాస్తున్నాయి. అవును.. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారులే చెబుతున్నారు. ఆ చెట్లు ఏంటో కూడా వివరిస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ కథనం మీ కోసమే. మీరు కూడా ఈ చెట్లను పెంచితే డబ్బులు కాస్తాయో.. లేదో తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను చూపుతోంది. పంట వేసింది మొదలు.. కోత కోసే వరకు ఈ మెళకువలు పాటిస్తే.. ఎక్కువ లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 విషయాలు గుర్తుంచుకోవాలని అంటున్నారు.

(1 / 10)

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను చూపుతోంది. పంట వేసింది మొదలు.. కోత కోసే వరకు ఈ మెళకువలు పాటిస్తే.. ఎక్కువ లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 విషయాలు గుర్తుంచుకోవాలని అంటున్నారు.(HT Telugu)

తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఉండే, అధిక దిగుబడి ఇచ్చే జాతుల మొక్కలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొక్కలను అధికార గుర్తింపు ఉన్న నర్సరీల నుండి మాత్రమే తీసుకోవాలి. కీటకాలు, తెగుళ్లు లేని ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంచుకోవాలి.

(2 / 10)

తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఉండే, అధిక దిగుబడి ఇచ్చే జాతుల మొక్కలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొక్కలను అధికార గుర్తింపు ఉన్న నర్సరీల నుండి మాత్రమే తీసుకోవాలి. కీటకాలు, తెగుళ్లు లేని ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంచుకోవాలి.(HT Telugu)

నీరు నిలబడకుండా, బాగా నీరు పారుదల అయ్యే ప్రాంతాన్ని పంట సాగుకోసం ఎంచుకోవాలి. ఎర్రటి లేదా ఎల్లో లాటరైట్ మట్టి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుంది. మట్టి pH స్థాయి 5.5 నుండి 6.5 మధ్య ఉండే బాగుంటుంది.

(3 / 10)

నీరు నిలబడకుండా, బాగా నీరు పారుదల అయ్యే ప్రాంతాన్ని పంట సాగుకోసం ఎంచుకోవాలి. ఎర్రటి లేదా ఎల్లో లాటరైట్ మట్టి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుంది. మట్టి pH స్థాయి 5.5 నుండి 6.5 మధ్య ఉండే బాగుంటుంది.(HT Telugu)

జూన్-జూలై నెలల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం మంచిది. మొక్కల మధ్య సరైన దూరం పాటించాలి. మొక్కలను సరైన పద్ధతిలో నాటాలి.

(4 / 10)

జూన్-జూలై నెలల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం మంచిది. మొక్కల మధ్య సరైన దూరం పాటించాలి. మొక్కలను సరైన పద్ధతిలో నాటాలి.(HT Telugu)

మొక్కలకు సరైన సమయానికి నీరు అందించాలి. చినుకు నీరు (డ్రిప్ వాటర్) పద్ధతి ద్వారా నీరు పెట్టడం మంచిది.

(5 / 10)

మొక్కలకు సరైన సమయానికి నీరు అందించాలి. చినుకు నీరు (డ్రిప్ వాటర్) పద్ధతి ద్వారా నీరు పెట్టడం మంచిది.(HT Telugu)

ఆయిల్ పామ్ మొక్కలకు సమతుల్య ఎరువులను అందించాలి. కోర్త తర్వాత మొక్కలకు ఎరువులు వేస్తే మంచిది.

(6 / 10)

ఆయిల్ పామ్ మొక్కలకు సమతుల్య ఎరువులను అందించాలి. కోర్త తర్వాత మొక్కలకు ఎరువులు వేస్తే మంచిది.(HT Telugu)

ఆయిల్ పామ్ తోటల్లో క్రమం తప్పకుండా కలుపు తీయాలి. అవసరమైతే కలుపు నివారిణిని ఉపయోగించవచ్చు.

(7 / 10)

ఆయిల్ పామ్ తోటల్లో క్రమం తప్పకుండా కలుపు తీయాలి. అవసరమైతే కలుపు నివారిణిని ఉపయోగించవచ్చు.(HT Telugu)

క్రమం తప్పకుండా మొక్కలను పరిశీలించి, కీటకాలు, తెగుళ్లు ఉన్నట్లయితే వెంటనే నియంత్రించాలి. జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం మంచిది.

(8 / 10)

క్రమం తప్పకుండా మొక్కలను పరిశీలించి, కీటకాలు, తెగుళ్లు ఉన్నట్లయితే వెంటనే నియంత్రించాలి. జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం మంచిది.(HT Telugu)

మొక్కలు పూర్తిగా పెరిగిన తర్వాత కోత కోయాలి. కోత కోసే పద్ధతిని కచ్చితంగా పాటించాలి.

(9 / 10)

మొక్కలు పూర్తిగా పెరిగిన తర్వాత కోత కోయాలి. కోత కోసే పద్ధతిని కచ్చితంగా పాటించాలి.(HT Telugu)

ఆయిల్ పామ్ తోటలో అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఒక టన్ను గెలల ధర రూ.17 వేల 43 ఉంది. కాపు కాసే సమయం నుంచి ఏడాదికి ఎకరాకు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు త్సల్లాభత్తుల శ్రీనివాసరావు చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు.

(10 / 10)

ఆయిల్ పామ్ తోటలో అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఒక టన్ను గెలల ధర రూ.17 వేల 43 ఉంది. కాపు కాసే సమయం నుంచి ఏడాదికి ఎకరాకు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు త్సల్లాభత్తుల శ్రీనివాసరావు చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు.(HT Telugu)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు