తెలుగు న్యూస్ / ఫోటో /
TG Govt Medical College Recruitment 2024 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 55 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..
- Khammam Medical College Recruitment 2024: ఫ్యాక్టలీ పోస్టుల భర్తీకి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులకు డిసెంబర్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

(1 / 6)
టీచింగ్ పోస్టుల భర్తీకి ఖమ్మం ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రకటన జారీ చేసింది. మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు.
(2 / 6)
మొత్తం 55 ఉద్యోగాలు ఉండగా..ఇందులో అత్యధికంగా సీనియర్ రెసిడెంట్ పోస్టులు 43 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు 7 ఉండగా...సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు రెండు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
(3 / 6)
జనరల్ మెడిసిన్, రేడియాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, బయో కెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, సైకియార్టీ తో పాటు మరికొన్ని విభాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్, ఎండీ, ఎఎంస్ తో పాటు పీజీ, డిప్లోమా ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన వారికి రూ. లక్షకు పైగా జీతం ఉంది. ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు.
(4 / 6)
https://gmckhammam.org/recruitement/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలను నమోదు చేసి... ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
(5 / 6)
డిసెంబర్ 20వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఖమ్మంలో ఉదయం 10. 30 గంటలకు ఇంటర్వ్యూలను ప్రారంభిస్తారు.
ఇతర గ్యాలరీలు