Electric Scooter : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కొత్త ఏడాదిలో పెరగనున్నాయి.. ఇప్పుడు కొంటే ఆఫర్!
Ather Rizta : కొత్త ఏడాదిలో కొన్ని కంపెనీలు కార్లు, బైకుల ధరలు పెంచనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఏథర్ రిజ్తా ఈవీ కూడా తన స్కూటీ ధర పెంచనున్నట్టుగా చెబుతున్నారు.
ఏథర్ రిజ్తా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చెతక్, ఓలా ఎస్1 వంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు బెంగళూరుకు చెందిన ఏథర్ రిజ్తా వచ్చింది. ఏథర్ రిజ్తా ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షల నుండి రూ.1.47 లక్షల మధ్య ఉంది. కానీ జనవరి 2025 నుండి ఈ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించలేరని తెలుస్తోంది. అత్యంత సరసమైన ఏథర్ రిజ్తా మోడల్ ధరను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు బ్రాండ్ పేర్కొంది.
ఏథర్ రిజ్తా ధరను రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెంచనున్నట్లు ఈథర్ డీలర్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ స్కూటర్ S, Z 2.9 kWh, Z 3.7 kWh అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి ఇప్పుడు వరుసగా రూ. 1.10 లక్షలు, రూ. 1.27 లక్షలు, రూ. 1.46 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. మీరు ప్రో ప్యాక్‌ని ఎంచుకుంటే వరుసగా రూ. 13,000, రూ. 15,000, రూ. 20,000 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రో ప్యాక్‌ని కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని ఫీచర్‌లు దొరుకుతాయి. ఏథర్ రిజ్తా ధర రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరగనుందని, అయితే ఏ వేరియంట్లకు ధర పెంపు అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఏథర్ 450 ఈవీ నుండి బ్యాటరీ, మోటార్, మెయిన్ ఫ్రేమ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాథమిక భాగాలను చాలా వరకు తీసుకుంటుంది.
అయితే మరోవైపు ఏథర్ సంవత్సర ముగింపు ఆఫర్‌లను కూడా అందిస్తుంది. షోరూమ్‌ల ద్వారా కాకుండా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే సంవత్సరాంతపు ఆఫర్ లభిస్తుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ రిస్టా S 2.9 kWh వేరియంట్‌లపై 16 శాతం తగ్గింపును ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు అనుకూలమైన ఈఎంఐ ఎంపికను ఎంచుకోవడానికి ఆప్షన్ అందిస్తుంది. ఈ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో వస్తుంది. మొదటి 2.9kWh 105 కిమీల పరిధిని అందిస్తుంది.
రిజ్తా 3.7 kWh బ్యాటరీ ప్యాక్ సుమారు 125 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది 4.3 kW గరిష్ట శక్తితో 22 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. పనితీరును పరిశీలిస్తే ఇది 4.7 సెకన్లలో 0-40 కేఎంపీహెచ్ నుండి స్పీడ్ అందుకోగలదు.
రిజ్తా ఈవీ 3.7 సెకన్లలో 0-40 కేఎంపీహెచ్ నుండి స్పీడు అందుకుంటుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీగా ఉంటుంది. ఏథర్ రిజ్తా వాహనం వన్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మోనో-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు వంటి అన్ని ఫీచర్లతో వస్తుంది. ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవీ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, టీఎఫ్‌టీ టచ్-ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 34-లీటర్ స్పేస్ ఉంటుంది.
గమనిక : 2025లో ధరల పెరుగుదల వివిధ రకాలుగా ఉండవచ్చు. మేం అంచనా మాత్రమే ఇచ్చాం. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ప్రకారం డిస్కౌంట్ వివరాలు అందించాం. భవిష్యత్తులో ఇది మారవచ్చు.