Amaravati CRDA Meeting : అమరావతిలో రూ.24,657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ-jagtial youth cheated retd employee lingked phone pe number bank account ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Crda Meeting : అమరావతిలో రూ.24,657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ

Amaravati CRDA Meeting : అమరావతిలో రూ.24,657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ

Bandaru Satyaprasad HT Telugu
Dec 16, 2024 11:41 PM IST

Amaravati CRDA Meeting : అమరావతి రాజధానిలో రూ.24276 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏతో జరిగిన మూడు సమావేశాల్లో కలిపి మొత్తంగా రూ.45,249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపారు.

అమరావతిలో రూ.24657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన బెటినేట్ సమావేశం
అమరావతిలో రూ.24657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన బెటినేట్ సమావేశం

Amaravati CRDA Meeting : సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ భేటీలో కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏతో జరిగిన మూడు సమావేశాల్లో కలిపి మొత్తంగా రూ.45,249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్‌ టవర్ నిర్మాణాలకు సీఆర్డీఏ భేటీలో ఆమోదం లభించిందన్నారు.

103 ఎకరాల్లో అసెంబ్లీ

ఈ పనులకు మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హైకోర్టుకు రూ.1048 కోట్లు, అసెంబ్లీ భవనానికి రూ.765 కోట్లు, ఐదు ఐకానిక్‌ టవర్లకు రూ.4,665 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు చేస్తామన్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు. సంవత్సరానికి అసెంబ్లీ కేవలం 40 నుంచి 50 రోజులు మాత్రమే జరుగుందన్నారు. మిగిలిన రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్‌ లా చూడవచ్చన్నారు. అసెంబ్లీ టవర్ కు రూ.768 కోట్లు ఖర్చు కానుందన్నారు. నాలుగు జోన్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లకు రూ.9,699 కోట్లు ఖర్చు అవుతందని చెప్పారు. ట్రంక్‌ రోడ్లకు రూ.7,794 కోట్లకు అనుమతులిచ్చామన్నారు. వచ్చే కేబినెట్ భేటీలో అమరావతి రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతామని నారాయణ తెలిపారు.

రాజధానిలో లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు,ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటీ సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ రూ.24,276.83 కోట్లకు సంబంధించిన పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. అమరావతి మొత్తం ఖర్చు రూ.62 వేల కోట్ల అంచనాలో ఇప్పటి వరకూ రూ.45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు తెలిపారు. అసెంబ్లీ భవనం 11.22 లక్షల చదరపు అడుగులు, 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపట్టనున్నామన్నారు.

టవర్ 1 నుంచి 4 వరకు 68,88,064 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ టవర్లకు రూ.4685 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.9,695 కోట్ల ఖర్చు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Whats_app_banner