TTD Arjitha Seva: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల, డిసెంబర్ 18న ఆన్‌లైన్‌లో బుకింగ్-march quota of srivari arjitha seva tickets released online booking on december 18 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Arjitha Seva: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల, డిసెంబర్ 18న ఆన్‌లైన్‌లో బుకింగ్

TTD Arjitha Seva: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల, డిసెంబర్ 18న ఆన్‌లైన్‌లో బుకింగ్

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 16, 2024 08:02 PM IST

TTD Arjitha Seva: తిరుమ‌ల శ్రీ‌వారి మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లు బుధవారం విడుదల కానున్నాయి. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబ‌రు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

టీటీడీ మార్చ్ నెల కోటా టిక్కెట్ల విడుదల
టీటీడీ మార్చ్ నెల కోటా టిక్కెట్ల విడుదల

TTD Arjitha Seva: తిరుమల ఆర్జిత సేవ ఆన్‌లైన్‌ టిక్కెట్లు డిసెంబర్‌ 18న విడుదల కానున్నాయి. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబ‌రు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి రానున్న సేవలు ఇవే..

డిసెంబ‌రు 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

డిసెంబ‌రు 21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

డిసెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

డిసెంబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

డైరెక్ట్‌ లింక్‌ ఇదే… టీటీడీ దర్శనాల కోసం భక్తులు దేవస్థానం వెబ్‌సైట్‌లో నేరుగా బుక్‌ చేసుకోవచ్చు.  https://ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

Whats_app_banner