Gemstone: చుట్టూ ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందా..? వీటిలో ఏదో ఒక రత్నాన్ని ధరించండి! తేడా మీకే తెలుస్తుంది-wear any one of these gems to remove negative energies around you ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gemstone: చుట్టూ ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందా..? వీటిలో ఏదో ఒక రత్నాన్ని ధరించండి! తేడా మీకే తెలుస్తుంది

Gemstone: చుట్టూ ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందా..? వీటిలో ఏదో ఒక రత్నాన్ని ధరించండి! తేడా మీకే తెలుస్తుంది

Ramya Sri Marka HT Telugu
Dec 16, 2024 07:00 PM IST

Gemstone: వ్యక్తి జీవితంలో ఎదుర్కునే రకరకాల సమస్యలను వేరు వేరు రత్నాలు ధరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని ప్రత్యేకమైన రత్నాలను ధరించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులను తగ్గించుకోవచ్చు. సానుకూలతను పెంచుకుని ఒత్తిడి నుంచి బయటపడచ్చు. అవేంటో తెలుసుకుందామా..

చుట్టూ ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందా..? వీటిలో ఏదో ఒక రత్నాన్ని ధరించండి!
చుట్టూ ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందా..? వీటిలో ఏదో ఒక రత్నాన్ని ధరించండి!

జ్యోతిష్య శాస్త్రంలో రత్నాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు రకరకాల రత్నాలతో పరిష్కారాన్ని కనుగొనచ్చు. వాటిని ధరించి నుంచి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు నమ్ముతారు. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెట్టే ప్రతికూల శక్తులను తగ్గించుకునేందుకు కొన్ని రకాల రత్నాలు సహాయపడతాయని ఈ శాస్త్రం నమ్మకంగా చెబుతుంది. పెట్టుకున్న వెంటనే ఫలితం చూపించకపోయినా.. నెమ్మదిగా పరిస్థితిన మార్చే శక్తి రత్నాలకు ఉంటుంది. జీవితంలో ప్రతికూల శక్తిని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన రత్నాలను ధరించడం మంచిది. ఈ రత్నాలను ధరించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని నమ్ముతారు. జీవితంలో మనశ్శాంతి, సమతుల్యత ఉంటుంది. కొన్ని రత్నాలు ధరించడం వల్ల పరిసరాల్లో ఉండే నెగెటివిటీ తగ్గి, విషశక్తి తొలగిపోతుందని చెబుతారు. జీవితంలో నెగిటివిటీని తగ్గించే రత్నాల గురించి తెలుసుకుందాం...

అమెథిస్ట్ స్టోన్:

అమెథిస్ట్ రత్నం ఊదా రంగులో ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచే ప్రత్యేక లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనస్సు ఆధ్యాత్మికతలో నిమగ్నమవుతుందని, ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావని నమ్ముతారు. ఇది భావోద్వేగ సమతుల్యతను సృష్టించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మానసిక స్పష్టత వస్తుందని కూడా చెబుతారు. ఒత్తిడి తగ్గి, ప్రతికూల భావాలు తొలగిపోతాయని నమ్ముతారు.

హెమటైట్ స్టోన్:

హెమటైట్ రాయిని 'స్టోన్ ఆఫ్ మైండ్' అంటారు. ఈ రాయిని ధరించడం వల్ల వ్యక్తిలో ఏకాగ్రత పెరుగుతుందని, ప్రతికూల శక్తి నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మూడ్ కూడా బాగుంటుంది. మానసిక స్పష్టతకు చాలా ప్రయోజనకరంగా జ్యోతిష్య నిపుణులు భావిస్తారు.

సిట్రిన్ స్టోన్:

సిట్రిన్ స్టోన్ పసుపు రంగులో ఉంటుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూలత తగ్గుతుందని నమ్ముతారు. ఇది వ్యక్తి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగించేందుకు దోహదపడుతుందని చెబుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆటంకాలు సృష్టించే శక్తులను తరిమికొడుతుంది. పరిస్థితులను సానుకూలంగా మారుస్తుంది.

రోజ్ క్వార్ట్జ్:

ఈ రత్నం ప్రేమ జీవితంలో భావోద్వేగ అవాంతరాలు, ఇతర సమస్యలను వదిలించుకోవడానికి రోజ్ క్వార్ట్జ్ స్ఫటికాలను ధరించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది క్రిస్టల్ పింక్ రంగులో ఉంటుంది. దీన్ని ధరించడం వల్ల మనిషి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. స్వీయ సందేహాలు ఉన్నవారు రోజూ క్వార్ట్జ్ రత్నాన్ని ధరించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సానుకూలతను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నమ్ముతారు.

సెలీనైట్:

ప్రతికూల జ్ఞాపకాలు, ప్రతికూల ఆలోచనలతో సహా ఇతర సమస్యలను అధిగమించడానికి సెలెనైట్ రాయిని ఉపయోగించవచ్చు. ఈ స్ఫటికం మనస్సును శుద్ధి చేస్తుందని నమ్ముతారు. దీన్ని ధరించడం వల్ల వ్యక్తిపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తక్కువగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో సుఖసంతోషాలతో కూడిన వాతావరణం నెలకొంటుంది.

రుబీ రత్నం :

రుబీ అనేది సూర్య గ్రహం నుండి శక్తిని పొందిన రత్నం. ఇది ఆత్మ విశ్వాసాన్ని పెంచడం, దురదృష్టం తగ్గించడం, శక్తి, ధన సంపదను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తుంది. జీవితంలో ఆశలు నెరవేర్చడానికి సహాయపడుతుంది.

వైడూర్య రత్నం:

వైడూర్య రత్నం కేతు గ్రహానికి చెందినది. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తుంది. జీవితంలో మంచి ఫలితాలను అనుగ్రహిస్తుంది. అదృష్టం, ధనం,రక్షణ కోసం ఉపయోగపడుతుంది.

హరిత రత్నం:

హరిత రత్నం అనేది అధిక శక్తి కలిగిన రత్నం. ఇది మానసిక శాంతిని అందిస్తుంది. శక్తి వృద్దికి ఉపయోగపడుతుంది.ఈ రత్నం ప్రతికూల శక్తులను తగ్గించడానికి మరియు శక్తిని పాజిటివ్‌గా మార్చడానికి సహాయపడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner