Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచకండి, అవి ఇంట్లో నెగిటివిటీని, కష్టాలను పెంచేస్తాయి-do not grow these plants in the house they increase negativity in the house ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచకండి, అవి ఇంట్లో నెగిటివిటీని, కష్టాలను పెంచేస్తాయి

Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచకండి, అవి ఇంట్లో నెగిటివిటీని, కష్టాలను పెంచేస్తాయి

Haritha Chappa HT Telugu

Unlucky Plants: ఇంటి అలంకరణ కోసం మొక్కలను అందంగా పెంచుతారు. పెరట్లో, ఇంటి బాల్కనీల్లో మొక్కలు పెంచే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మీ ఇంట్లో పెంచకూడని మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇవి మీ ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచేస్తాయి.

పెంచకూడని మొక్కలు (Shutterstock)

పచ్చని మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇవి అందంగా కనిపించడమే కాకుండా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో మొక్కలు నాటేందుకు అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు ఇంటి ముందు మొక్కలు పెంచడం అనేది ట్రెండ్ గా మారింది. ఇంటి అలంకరణలో మొక్కలు ముఖ్యమైన భాగంగా మారిపోయాయి.

వాస్తవానికి, మొక్కలకు, శక్తికి సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు ఇంట్లో సానుకూలతను పెంచడానికి సహాయపడితే, కొన్ని మొక్కలు ఇంటిని ప్రతికూలత వైపు నెట్టివేస్తాయి. ఈ రోజు మేము మీ ఇంట్లో పెంచకూడని మొక్కలు కొన్ని ఉన్నాయి. వీటిని బాల్కనీలో, పెరట్లో ఉంటే వెంటనే తొలగించేయండి.

బోన్సాయ్ మొక్కలు

ప్రతి ఇంట్లో బోన్సాయ్ మొక్కలు నాటే ట్రెండ్ బాగా పెరిగింది. అవి చాలా అందంగా కనిపిస్తాయి, అందువల్ల ఎంతో మంది వాటిని ఇంటి పెరట్లో, బాల్కనీలో పెంచడం ప్రారంభించారు. అయితే బోన్సాయ్ మొక్కలను మీ ఇంటి బాల్కనీ లేదా ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే అవి ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ మొక్కలు ఇంటి ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఈ మొక్కల ప్రతికూల శక్తి మొత్తం కుటుంబానికి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది, కాబట్టి వాటిని పెంచకపోవడమే మంచిది.

పత్తి మొక్క

కొంతమంది తమ ఇంట్లో పత్తి మొక్కను కూడా నాటుతారు. చూసేందుకు ఈ మొక్క అందంగా కనబడుతుంది. దీని నుండి వచ్చే పత్తిని కూడా ఉపయోగిస్తారు. ఎంతోమంది ఇంటి తోటల్లో పత్తి మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, మతపరంగా, ఇంట్లో పత్తి మొక్కను నాటడం మంచిది కాదు. పత్తి మొక్క నాటిన ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉంటుందని, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుందని చెబుతుంటారు.

కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు

చాలా మంది తమ ఇంటి తోటలు, బాల్కనీలలో కాక్టస్ మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ రోజుల్లో వాటిని అలంకరణకు బాగా ఇష్టపడుతున్నారు. అయితే, ఇంట్లో కాక్టస్ లేదా ఏదైనా ముళ్ల మొక్కను పెంచకూడదు. నిజానికి ఈ ముళ్ల మొక్కలు ఇంటికి నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. కాక్టస్ ఉన్న ఇంట్లో కుటుంబీకులు కష్టాల బారిన పడతారు. మీకు కాక్టస్ మొక్కను నచ్చితే ఇంటి లోపల పెంచకూడదు, ఇంటి వెలుపల దీన్ని పెంచవచ్చు.

జిల్లేడు మొక్కలు

తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ మొక్క పువ్వులను శివారాధనలో కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఈ మొక్కను ఇంట్లో నాటడం మంచిది కాదు.ఈ మొక్క నుండి వెలువడే ప్రతికూల శక్తి కుటుంబానికి హానికరం. వాస్తవానికి, జిల్లేడు మొక్క తెలుపు రంగు ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది, ఇది ప్రతికూలతను ఆకర్షిస్తుందని చెబుతారు.

నిమ్మకాయ మొక్క

కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడే వారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించడం ప్రారంభించారు. ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి. ఈ సిట్రస్ పండ్ల మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని, ఇంటి సభ్యులు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారని అంటారు.