Tuesday Motivation: మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, ప్రతికూల ఆలోచనలను ఎలా అధిగమించాలో చెబుతున్న సద్గురు-sadhguru tells how to keep the mind calm and how to overcome negative thoughts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation: మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, ప్రతికూల ఆలోచనలను ఎలా అధిగమించాలో చెబుతున్న సద్గురు

Tuesday Motivation: మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, ప్రతికూల ఆలోచనలను ఎలా అధిగమించాలో చెబుతున్న సద్గురు

Haritha Chappa HT Telugu
Oct 01, 2024 05:00 AM IST

Tuesday Motivation: జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనసు చంచలంగా మారి నెగెటివ్ ఆలోచనలు రావడం మొదలవుతుంది. అటువంటి ఆలోచనలను అధిగమించడానికి, మీరు సద్గురు యొక్క ఈ సలహాను పాటించాలి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ

మంచి చెడు ఆలోచనలు తరచూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. కానీ చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలను మాత్రమే మనసులో ఉంచుకోవాలనుకునే వారిలో మీరు కూడా ఒకరా? అయితే మీకు సద్గురు సలహాను తీసుకోవాలి. సద్గురు ఒకసారి నెగిటివ్ ఆలోచనలను తొలగించుకోవడం ఎలాగో వివరిస్తున్నారు.

కొంతమంది తమ మనస్సుల నుండి ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. సానుకూల ఆలోచనలపై మాత్రమే దృష్టి పెడతారు. ఏదేమైనా, మీరు దేనినైనా సాధించడానికి ప్రయత్నించినప్పుడు, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు మీ జీవితం నుండి ఏ లక్షణాన్ని తొలగించాలనుకుంటున్నారో అదే మీకు అలవాటుగా మారిపోతుంది. మీరు సానుకూలంగా ఉండాలని పదే పదే అనుకోండి, కచ్చితంగా అది మీ లక్షణంగా మారిపోతుంది.

మన మనసు నుంచి ఏదైనా విషయాన్ని, లక్షణాన్ని తొలగించాలనుకుంటే ముందుగా మెదడు పనితీరును అర్థం చేసుకోవాలి. మన మెదడులో తీసివేయడం అనే లక్షణం ఉండదు. కేవలం ఆ లక్షణానికి మరిన్ని అలవాట్లు జతకావడమే ఉంటుంది. కాబట్టి ఏదీ మీరు తీసేయాలనుకోకండి, చెడు లక్షణాలన మంచివిగా మార్చాలని అనుకోండి. మరింత సానుకూలంగా ఉండాలని భావించండి. కష్టపడి పనిచేస్తే అది పెరుగుతుంది.

మీరు కళ్ళు మూసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు చూడలేరు. మీ గురించి మీకు తప్ప ఇంకెవరికీ ఎక్కువ తెలియదు. ఉన్న ఒక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి. జీవితంలో అతి ముఖ్యమైన అంశం ఈ క్షణం జీవించడం. ఎవరేమనుకుంటారో, ఏం ఆలోచిస్తారన్నది ముఖ్యం కాదు. ప్రస్తుతం మనం సజీవంగా, సంతోషంగా ఉండటం ముఖ్యం. మీలోని ప్రాథమిక చైతన్యంపై దృష్టి పెట్టండి. అప్పుడు మీకు, మీ ఆలోచనా విధానానికి మధ్య ఉన్న దూరాన్ని గుర్తించగలరు. మీ మానసిక, శారీరక ప్రక్రియల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడమే బాధకు ముగింపు అని సద్గురు చెప్పారు.

ఆలోచనలను తొలగించవచ్చా?

చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలను మాత్రమే ఉంచుకోవాలని భావించేవారికి అది చేయడం చాలా కష్టమని సద్గురు చెప్పారు. ఎందుకంటే ఏ ఆలోచనను తొలగించలేము. కాసేపు వాయిదా వేసుకోవచ్చు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని నామాన్ని జపించడం ద్వారా దాన్ని నివారించవచ్చు. మీ ఆలోచనలు మీతోనే ఉంటాయి. వాటిని ఎవరూ వేరు చేయలేరు.

మీరు ఒకరి కోసం ప్రతికూలంగా ఆలోచించినప్పుడు, అది మీకు తప్ప మరొకరికి హాని కలిగించదు. చెడు ఆలోచనలను అధిగమించడానికి మీరు పెద్దగా చేయనవసరం లేదు. వేరే వాళ్ల గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుగా ఆలోచించడం మానేయండి. వీలైనంత వరకు ఎవరికైనా మంచి చేయడానికే ప్రయత్నించండి.