తెలుగు న్యూస్ / ఫోటో /
Lovable Zodiac Signs: ఈ రాశి వారికి ప్రేమ, ఆకర్షణా శక్తి ఎక్కువ.. వీళ్లను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు
- Lovable Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులు అయస్కాంత శక్తి కలిగి ఉంటారు. వీరిలో ఊద్వేగభరితమైన శక్తి, లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడికెళ్లినా అక్కడ వీరిని ప్రేమించే వ్యక్తులు ఉంటారు.
- Lovable Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులు అయస్కాంత శక్తి కలిగి ఉంటారు. వీరిలో ఊద్వేగభరితమైన శక్తి, లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడికెళ్లినా అక్కడ వీరిని ప్రేమించే వ్యక్తులు ఉంటారు.
(1 / 6)
ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు, స్వభావం ఉంటాయి. అవి వ్యక్తుల జీవితంలో ప్రేమ సంబంధాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు సహజంగా ప్రేమను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరిలో అయస్కాంత లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వెళ్లని ప్రతి చోట ప్రేమను పొందగలిగే, పంచగలిగే శక్తి వీరికి మెండుగా ఉంటుంది. వీరి స్వభావాన్ని ప్రతి ఒక్కరూ వీరిని మెచ్చుకుని వీరికి మరింత దగ్గరవాలని ప్రయత్నిస్తుంటారు.అందరి మనసుల్లోనూ వీరికి ప్రతేక స్థానం ఉంటుంది. ప్రేమను ఆకర్షించే లక్షణాలున్న రాశులేవో తెలుసుకుందాం.
(2 / 6)
మేషం:మేషం రాశి వారికి ప్యాషన్, ఉత్సాహం, మోహకమైన వ్యక్తిత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మంగళ గ్రహం పాలించే మేషం వారు సహజ నాయకులై, ఉత్తేజంగా, నమ్మకంగా వ్యవహరిస్తారు. ఇవన్నీ ఇతరులను ప్రేమగా ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి కారణమవుతాయి. వీరిపై మోహాన్ని పెంచుతాయి. కొత్తగా పరిచయం అయిన వారైనా, చాలా రోజుల నుంచీ తెలిసిన వారే అయినా వీరి పట్ట ఇతరులకు ఉండే ఆసక్తి, ప్రేమగా వేరే లెవెల్లో ఉంటాయి. అంతలా ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది.
(3 / 6)
వృషభం: వృషభ రాశిలో జన్మించిన వారు నిజాయితీ, ఆత్మీయత, ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. శుక్ర గ్రహం పాలనలో ఉంటారు కనుక వీరు సహజంగా ప్రేమను, సౌందర్యాన్ని, శాంతిని వారి సంబంధాలలో సృష్టించగలుగుతారు. విశ్వసనీయమైన భాగస్వామ్యులు, ప్రేమలో అంకితభావం కలిగిన వారు. కనుక అందరూ వీరిని ఇష్టపడతారు.
(4 / 6)
సింహం: సింహం రాశి వారు అరణ్యరాజులుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. వీరి చాలా మోహకంగా, ఆకర్షణీయంగా ఉంటారు. సూర్య గ్రహం పాలనలో ఉంటారు కనుక వీరిలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణను ఎక్కువగా ఉంటాయి. వీరి ఉత్సాహం, తాపత్రయం, దయార్ధం గొప్పగా భావాలు ఇతరులను ఆకర్షించి, ప్రేమలోకి ఆహ్వానిస్తాయి. ఇతరులతో వీరి సంబంధాలు ప్రతిష్ఠాత్మకంగా ఉండేలా ప్రయత్నిస్తారు.
(5 / 6)
తులా: తులా రాశి వారు బ్యాలెన్, సామరస్యాన్ని సూచిస్తారు. వీరిని శుక్ర గ్రహం పాలిస్తుంది.సహజంగానే ఆకర్షణీయులుగా, నైపుణ్యంతో కూడిన వారుగా ఉంటారు. ఇతరులతో లోతైన భావోద్వేగ సంబంధాలను సృష్టించగలుగుతారు. ప్రేమలో వారు సహజంగా సామరస్యాన్ని కాపాడగలరు. అందుకే వీరు చాలా అందమైన, సమతుల్యమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. అందరూ మెచ్చకునేలా ఉంటారు.
ఇతర గ్యాలరీలు