TG Inter Exams Schedule 2025 :తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, టైమ్ టేబుల్ ఇదే
TG Inter Exams Schedule 2025 : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
TG Inter Exams Schedule 2025 : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమస్ వ్యాల్యూస్ పరీక్ష, 30న పర్యావరణ పరీక్ష జరగనుంది.
ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 1న, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఒకేసారి ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలు
ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్ ఫస్టియర్ టైమ్ టేబుల్
- మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1
- మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
- మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1
- మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
- మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
ఇంటర్ సెకండియర్ టైమ్ టేబుల్
- మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2
- మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
- మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
- మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2
- మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
- మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2
ఈ తేదీల్లోనే ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. ఒకేషనల్ పరీక్షల టైమ్ టేబుల్ ను విడిగా విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మార్చి 1నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్,ఒకేషనల్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
- మార్చి 1- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 4 - ఇంగ్లీష్ పేపర్ 1
- మార్చి 6- మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
- మార్చి 8 - మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- మార్చి 11 - ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
- మార్చి 13- కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
- మార్చి 17 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్(బైపీసీ విద్యార్థుల కోసం)
- మార్చి 19 -మోడరన్ లాంగ్వేజ్ పేపర్1, జాగ్రఫీ పేపర్ 1
ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
- మార్చి 3 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 5 - ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 7-మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
- మార్చి 10- మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
- మార్చి 12- ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
- మార్చి 18- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2(బైపీసీ విద్యార్థుల కోసం)
- మార్చి 20 -మోడరన్ లాంగ్వేజ్ పేపర్2, జాగ్రఫీ పేపర్ 2
సంబంధిత కథనం