Telangana News Live December 16, 2024: Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 16 Dec 202405:00 PM IST
Jagtial Cheating : జగిత్యాలలో ఓ యువకుడు రిటైర్డ్ ఉద్యోగిని బురిడీ కొట్టించి ఏడేళ్లుగా నెలకు రూ.20 వేలు చొప్పున రూ.17 లక్షలు కాజేశాడు. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు తన ఫోన్ పే నెంబర్ యాడ్ చేసి నెల నెలా రూ.20 వేలు కాజేస్తున్నాడు.
Mon, 16 Dec 202404:28 PM IST
Ponguleti Srinivas Reddy : ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తుంది. నిధుల బదలాయింపుపై కేబినెట్ లో చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనన్నారు.
Mon, 16 Dec 202402:26 PM IST
Adilabad Low Temperatures : ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తుంది. ఉత్తరాది చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో అత్యల్ప స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడుతున్నారు.
Mon, 16 Dec 202401:59 PM IST
TG Group 2 Exam : తెలంగాణలో ఆసక్తికర ఘటన జరిగింది. పురిటి నొప్పులను భరిస్తూ ఓ అభ్యర్థి గ్రూప్ 2 పరీక్ష రాశారు. పరీక్ష రాస్తున్న సమయంలో నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు.
Mon, 16 Dec 202412:49 PM IST
Mon, 16 Dec 202412:13 PM IST
- Telangana Assembly : నోటిఫికేషన్లు విడుదల చేయడం అంటే ఉద్యోగాలు ఇవ్వడం కాదని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అది గత పాలకుల విధానమని సెటైర్లు వేశారు. ఉద్యోగాల భర్తీపై కౌన్సిల్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. ఉద్యోగాల భర్తీ లెక్కలు చెప్పారు.
Mon, 16 Dec 202409:15 AM IST
- TG Ration Cards : సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతునట్లు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ఈ మేరకు ప్రకటన చేశారు. దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నట్టు వెల్లడించారు.
Mon, 16 Dec 202408:10 AM IST
- Mohan Babu Case : మంచు మోహన్‌బాబు అరెస్టుపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని స్పష్టం చేశారు. మోహన్‌బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని.. స్పందించకపోతే అరెస్టు తప్పదని చెప్పారు. ఆయన ఈనెల 24 వరకు సమయం అడిగారని వివరించారు.
Mon, 16 Dec 202407:37 AM IST
- Maoist : మావోయిస్టులు నిత్యం అడవుల్లో ఉంటారు. పీడిత ప్రజల పక్షాన పోరాడతామని చెబుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో మావోయిస్టులు బలహీనపడ్డారు. ఈ క్రమంలో ఓ ఆంశం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు పిల్లలు పుట్టకుండా ముందే ఆపరేషన్ చేయించుకుంటారని తెలిసింది.
Mon, 16 Dec 202406:54 AM IST
- Telangana Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అయ్యింది. కానీ.. మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై సీఎం, మంత్రులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
Mon, 16 Dec 202405:00 AM IST
- Medaram : ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వన దేవతల క్షేత్రం మేడారం. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో వనం కిక్కిరిసిపోతుంది. ఇటీవల నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆలయాల పునర్నిర్మాణానికి పూనుకుంది.
Mon, 16 Dec 202404:16 AM IST
- Telangana Weather : చలితో తెలంగాణ గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండోచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Mon, 16 Dec 202403:54 AM IST
- Vikarabad Tragedy: వికారాబాద్‌లో దారుణం జరిగింది. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు చికిత్స అందించడానికి ఆధార్ కార్డు కోసం పట్టుబట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది.
Mon, 16 Dec 202412:20 AM IST
- Huzurabad Schoolbus: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో స్కూల్ బస్సు దగ్ధమైంది. ప్రైవేటు స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన బస్సు కాలి బూడిద అయింది. ఆదివారం సెలవు కావడంతో బస్సు ఉన్న ప్రాంతంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.