CRPF Recruitment : సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. రూ.75వేల జీతం, రాత పరీక్ష లేకుండానే జాబ్!
CRPF Recruitment 2024 : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సీఆర్‌పీఎఫ్‌లో పశువైద్యుని పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఆర్పీఎఫ్ అనేది భారతదేశంలోని అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీసు దళం. దీనిలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ఎల్లప్పుడూ జరుగుతుంది. మీరు కూడా ఇందులో ఉద్యోగం చేయాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. సీఆర్‌పీఎఫ్‌లో పశువైద్యుని పోస్ట్‌ల కోసం ఉద్యోగానికి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం రెండు పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ వెలువడింది. ఎంపికైన అభ్యర్థులను 5వ మరియు 10వ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలుగా ఉంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్ మరియు యానిమల్ హస్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్‌లో కూడా నమోదు చేసుకోవాలి. BVSc/MVSc (అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ/సర్జరీ అండ్ రేడియాలజీ/క్లినికల్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్) ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
ఎంపికైన అభ్యర్థుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడు సంవత్సరాల ప్రారంభ వ్యవధిలో ఉంటుంది. సీఆర్‌పీఎఫ్‌లో వెటర్నరీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.75 వేలు వేతనం అందజేస్తారు. నెలవారీ జీతంతో పాటు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ అటెండెన్స్ ట్రీట్‌మెంట్, సీనియారిటీ, ప్రమోషన్ మొదలైన అనేక అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో వెటర్నరీ పోస్టుకు అభ్యర్థులను ఇంటర్వ్యూ, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ 6 జనవరి 2025న ఉదయం 9 గంటలకు పూణే, హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ కాంపోజిట్ హాస్పిటల్‌లో నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాల ఒరిజినల్, ఫోటోకాపీలను తీసుకురావాలి.
ఇంటర్వ్యూ అడ్రస్
06 జనవరి 2025 9 AM కాంపోజిట్ హాస్పిటల్, CRPF, GC క్యాంపస్, తాలెగావ్, పూణే, మహారాష్ట్ర – 410507
06 జనవరి 2025 ఉదయం 9 AM కాంపోజిట్ హాస్పిటల్, CRPF, హైదరాబాద్, తెలంగాణ – 500005