WPL 2025 Auction Highlights: డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో భారీ ధర పలికిన సిమ్రాన్ షేక్.. 16 ఏళ్ల కమలిని కూడా రికార్డు ధర-wpl 2025 auction highlights full list of squads for all teams after auction ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2025 Auction Highlights: డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో భారీ ధర పలికిన సిమ్రాన్ షేక్.. 16 ఏళ్ల కమలిని కూడా రికార్డు ధర

WPL 2025 Auction Highlights: డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో భారీ ధర పలికిన సిమ్రాన్ షేక్.. 16 ఏళ్ల కమలిని కూడా రికార్డు ధర

Galeti Rajendra HT Telugu
Dec 15, 2024 08:38 PM IST

WPL 2025 Auction Highlights: బెంగళూరు వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ 2025 వేలం ముగిసింది. 19 మంది ప్లేయర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయగా.. అత్యధిక ధర భారత్‌కి చెందిన సిమ్రాన్ దక్కించుకుంది.

డబ్ల్యూపీఎల్ 2025 వేలం
డబ్ల్యూపీఎల్ 2025 వేలం (X)

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలం ఆదివారం బెంగళూరులో ముగిసింది. ఈ వేలంలో 19 మంది ప్లేయర్లని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. భారత్‌కి చెందిన మిడిలార్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ రూ.1.90కోట్లతో అత్యధిక ధర పలికిన అమ్మాయిగా నిలిచింది. సిమ్రాన్‌ను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన విదేశీ ప్లేయర్‌గా డీండ్రా డాటిన్ (వెస్టిండీస్) నిలిచింది. ఆమెని కూడా గుజరాత్ 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.

వేలంలో 16 ఏళ్ల కమలిని కూడా మంచి ధర దక్కింది. తమిళనాడుకి చెందిన కమలిని రూ.10 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి వరకూ పోటీపడిన ముంబయి ఇండియన్స్ రూ.1.60 కోట్లకి కొనుగోలు చేసింది.

వేలం తర్వాత జట్లు.. ఇలా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, కేట్ క్రాస్, కనికా అహుజా, డానీ వ్యాట్, సోఫీ మొలినెక్స్, ఏక్తా బిష్త్, రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ, ప్రేమా రావత్, జోషితా వీస్, రాఘవి బిస్త్, జాగ్రావి పవార్.

గుజరాత్ జెయింట్స్ జట్టు

ఆష్లే గార్డనర్, బెత్ మూనీ (కెప్టెన్), దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబీ లిచ్ఫీల్డ్, మేఘనా సింగ్, కాష్వి గౌతమ్, సయాలీ సత్గారే, దీంద్ర డాటిన్, సిమ్రాన్ షేక్, డేనియల్ గిబ్సన్, ప్రఖికా నాయక్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, భారతి ఫుల్మాలి.

యూపీ వారియర్స్ జట్టు

అలిస్సా హీలీ (కెప్టెన్), అంజలి శ్రావణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవగీరే, తహ్లియా మెక్గ్రాత్, బృందా దినేష్, సైమా ఠాకూర్, పూనమ్ ఖేమ్నార్, గౌహర్ సుల్తానా, చమరి అథపత్తు, ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, క్రాంతి గౌర్, ఆరుషి గోయల్, అలన్నా కింగ్.

ముంబై ఇండియన్స్

హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్జోత్ కౌర్, అమేలియా కెర్, క్లోయి ట్రియోన్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యస్తిక భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్దీప్ కౌర్, ఎస్ సజ్నా, కీర్తన్, నదీన్ డి క్లెర్క్, జి కమలిని, సంస్కృతి గుప్తా, అక్షిత మహేశ్వరి, హేలీ మాథ్యూస్, జింటిమణి కలితా, నటాలీ స్కివర్.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

ఆలిస్ క్యాప్సీ, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, మారిజానే కాప్, మెగ్ లానింగ్ (కెప్టెన్), మిన్ను మణి, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, శిఖా పాండే, నందిని కశ్యప్, ఎన్ చరణి, సారా బ్రైస్, నిక్కీ ప్రసాద్, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్.

ఈరోజు వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ల జాబితా

  • దీంద్రా డాటిన్ - రూ.1.70 కోట్లు - గుజరాత్ జెయింట్స్
  • నాడిన్ డి క్లార్క్ - రూ.30 లక్షలు - ముంబై ఇండియన్స్
  • కమలిని - రూ.1.60 కోట్లు - ముంబై ఇండియన్స్
  • సిమ్రాన్ షేక్ - రూ.1.90 కోట్లు - గుజరాత్ జెయింట్స్
  • నందిని కశ్యప్ - రూ.10 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్
  • ప్రేమా రావత్ - రూ.1.2 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • ఎన్ చరానీ - రూ.55 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్
  • క్రాంతి గౌర్ - రూ.10 లక్షలు - యూపీ వారియర్స్
  • సంస్కృతి గుప్తా - రూ.10 లక్షలు - ముంబై ఇండియన్స్
  • జోషితా వీజే - రూ.10 లక్షలు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • సారా బ్రైస్ - రూ.10 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్
  • అలానా కింగ్ - రూ.30 లక్షలు - యూపీ వారియర్స్
  • రాఘవి బిస్త్ - రూ.10 లక్షలు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • జాగ్రావి పవార్ - రూ.10 లక్షలు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • నిక్కీ ప్రసాద్ - రూ.10 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్
  • డేనియల్ గిబ్సన్ - రూ.30 లక్షలు - గుజరాత్ జెయింట్స్

Whats_app_banner