చలికాలంలో విటమిన్-సీ ఉండే ఆహారాలు కచ్చితంగా ఎందుకు తినాలో తెలుసా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 15, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో విటమిన్-సీ పుష్కలంగా ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉండే ఈ కాలంలో ఆ విటమిన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

విటమిన్-సీ శరీరంలో రోగ నిరోధక శక్తిని చాలా బలపరుస్తుంది. కణాల వృద్దికి ఉపకరిస్తుంది. ఐరన్ సహా వివిధ పోషకాలను శరీరం మెరుగ్గా శోషించుకునేలా చేస్తుంది. 

Photo: Pexels

ఇమ్యూనిటీని మెరుగుపరచడం ద్వారా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధుల రిస్క్‌ను విటమిన్ సీ తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా చేయదలదు. వ్యాధులతో శరీరంలో దీటుగా పోరాడేందుకు సాయపడుతుంది. 

Photo: Pexels

శరీరంలో రక్తప్రసరణను విటమిన్ సీ పెంచగలదు. దీంతో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. 

Photo: Pexels

చలికాలంలో చర్మం పొడిబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. విటమిన్ సీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. పొడిబారడం, ముడతలు పడడం లాంటివి తగ్గించగలదు.

Photo: Pexels

నారింజ, నిమ్మ, చీనీ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. స్ట్రాబెర్రీలు, కివీలు, జామపండ్లలోనూ ఈ పోషకం మెండుగా లభిస్తుంది.

Photo: Pexels

చిలగడదుంపలు, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, టమాటోలు, క్యాప్సికం లాంటి కూరగాయల్లోనూ విటమిన్ సీ పుష్కలం. పాలకూరలోనూ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. 

Photo: Pexels

శరీరంపై ఒక్కో భాగంలో ఉండే పుట్టుమచ్చ ఒక్కో రకమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని మీకు తెలుసా?  ఏ భాగంలో ఉండే పుట్టు మచ్చ ఎలాంటి అదృష్టం కలిగిస్తుందో తెలుసుకుందాం. 

Pexel