Bigg Boss Remuneration: బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్.. 105 రోజుల రెమ్యునరేషన్ ఎంతంటే?-bigg boss telugu 8 nabeel eliminated on grand finale today and bigg boss 8 telugu nabeel remuneration per week details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Remuneration: బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్.. 105 రోజుల రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss Remuneration: బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్.. 105 రోజుల రెమ్యునరేషన్ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 15, 2024 08:14 PM IST

Bigg Boss Telugu 8 Nabeel Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరుగుతోంది. డిసెంబర్ 7 గంటలకు బిగ్ బాస్ 8 తెలుగు ఫినాలే ప్రారంభం అయింది. అయితే, ఈపాటికే టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రీది ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌజ్‌లో 105 రోజులకు నబీల్ రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం.

బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్.. 105 రోజుల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్.. 105 రోజుల రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss 8 Telugu Nabeel Elimination: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15 రాత్రి 7 గంటలకు ప్రారంభం అయింది. ఇవాళే బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే, ఈపాటికే టాప్ 5 కంటెస్టెంట్స్‌లలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌

టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ అయితే.. టాప్ 4గా ప్రేరణ ఇంటి నుంచి స్టేజీపైకి వచ్చింది. దాంతో టాప్ 3 కంటెస్టెంట్స్‌గా గౌతమ్, నిఖిల్, నబీల్ మిగిలారు. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారం నాడే జరిగింది. ఇవాళ టాప్ 3 కంటెస్టెంట్ ఎలిమినేషన్, టైటిల్ విన్నర్‌ను మరికాసేపట్లే అధికారికంగా ప్రకటిస్తారు.

నేటికి 105 రోజులు పూర్తి

అయితే, గ్రాండ్ ఫినాలే ప్రారంభ సమయానికే ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం అయిందని సమాచారం. దాని ప్రకారం టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్ ఎలిమినేట్ అయ్యాడని బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఎలాంటి మనీ ఆఫర్‌కు లొంగని నబీల్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అయితే, సెప్టెంబర్ 1న ప్రారంభం అయిన బిగ్ బాస్ 8 తెలుగు ఇవాళ్టికి 105 రోజులు, 15 వారాలు పూర్తి చేసుకుంది.

నబీల్ రెమ్యునరేషన్

ఈ లెక్కన సెప్టెంబర్ 1న ఆఖరి (14వ) కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు నబీల్. ఫినాలే వరకు ఉన్న నబీల్ వారానికి రోజుకు రూ. 28,571, రూ. 2 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన 105 రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న నబీల్ మొత్తంగా సుమారుగా రూ. 30 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే, బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 15 వారాలకు నబీల్ అఫ్రీది రూ. 30 లక్షల డబ్బు సంపాదించినట్లు అర్థం చేసుకోవచ్చు.

వరంగల్ యూట్యూబర్

కాగా నబీల్ వరంగల్‌కు చెందిన ఒక యూట్యూబర్. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్ డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తుంటాడు నబీల్. బిగ్ బాస్ హౌజ్‌లోకి కిర్రాక్ సీతకు బడ్డీగా 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నబీల్ గేమ్ పరంగా అందరికీ ఫుల్ టఫ్ ఇచ్చాడు. హౌజ్‌లో షేర్ అనిపించుకున్నాడు. ఫలితంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉండి రూ. 30 లక్షలు సంపాదించుకున్నాడు నబీల్ అఫ్రీది.

Whats_app_banner