Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లో వరంగల్ యూట్యూబర్.. ఆ డైరెక్టర్ డ్రాప్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss Telugu 8 Warangal Youtuber: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్‌లో వరంగల్ యూట్యూబర్ నబీల్ అఫ్రిది ఉన్నాడు. అయితే, ఆఖరు నిమిషంలో ఓ డైరెక్టర్ డ్రాప్ అవ్వడంతో ఇతని పేరు వినిపిస్తోంది. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం.
Bigg Boss 8 Telugu Final Contestants: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఇవాళ (సెప్టెంబర్ 1) చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇదివరకే బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో నాగార్జున్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించగా.. హీరో నాని, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, రానా దగ్గుబాటి, నివేదా థామస్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్స్
వారందరితో నాగార్జున సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు. అలాగే కంటెస్టెంట్లను జోడీలుగా హౌజ్‌లోకి పంపించారు. అయితే, ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు వచ్చినవన్నీ రూమర్స్‌గా పరిగణించారు. కానీ, ఇవాళ ఫైనల్ లిస్ట్ తెలిసిపోయింది.
కొత్త వాళ్లు
మొన్నటివరకు వినిపించిన వాళ్లతోపాటు మరికొంతమంది కొత్తగా యాడ్ అయ్యారు. బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్‌లో హీరో ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, సీరియల్ నటి యష్మీ గౌడ, కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ కంబం, సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఉన్నారు.
డ్రాప్ అయిన డైరెక్టర్
వీరితోపాటు ఆర్జే శేఖర్ బాషా, డ్యాన్సర్ నైనిక అనరుసు, యూట్యూబర్ బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నటి సోనియా ఆకుల, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్, డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే 14 మంది ఉన్నారు. అయితే వీరిలో నుంచి డైరెక్టర్ పరమేశ్వర హివ్రాలే చివరి నిమిషంలో డ్రాప్ అయినట్లు సమాచారం.
వరంగల్ యూట్యూబర్
ఆయన స్థానంలో కొత్తగా వినిపించిన పేరు యూట్యూబర్ నబీల్ అఫ్రిది. వరంగల్‌కు చెందిన నబీల్ అఫ్రిది మెసేజ్ ఒరియెంటెడ్ కాన్సెప్ట్ వీడియోలు చేస్తుంటాడు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో వాటిని పోస్ట్ చేస్తుంటాడు. తన ఛానెల్‌కు సుమారుగా 1.62 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
మొత్తం 14 మంది ఎంట్రీ
ఈ 14 మంది ఇవాళ ఆదివారం నాడు హౌజ్‌లోకి జోడీలుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈపాటికే షూటింగ్ పూర్తి కాగా మనకు నేడు ప్రసారం కానుంది. ఇక వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరికొంతమంది ఫైనల్ కంటెస్టెంట్స్‌ను హౌజ్‌లోకి పంపిస్తారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మూడు నుంచి 5 వారాల మధ్య ఉండొచ్చు.
వైల్డ్ కార్డ్‌తో ముగ్గురు
కానీ, ఇవాళ ప్రోమోలో తొలిరోజే ఎలిమినేషన్ అన్నట్లుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌లో ఒకరు ఎలిమినేట్ వారి ప్లేసులో మరొకరు వచ్చే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా జబర్దస్త్ రాకేష్, న్యూస్ రీడర్ కల్యాణి, మోడల్ రవితేజ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టాపిక్