Nagarjuna: కాబోయే కోడలు శోభిత ధూళిపాళపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్స్ ట్రోలింగ్
Nagarjuna Comments On Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఇవాల (ఆగస్ట్ 8) ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు కాబోయే కోడలు శోభిత ధూళిపాళపై నాగార్జున చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Nagarjuna About Sobhita Dhulipala: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశమైన జంటల్లో ఒకరిగా శోభితా ధూళిపాళ, నాగచైతన్య మారిపోయారు. అందుకు ఇన్నాళ్లు వారిపై వస్తున్న లవ్ రిలేషన్‌షిప్ రూమర్స్ ఒకటి అయితే నేడు (ఆగస్టు 8) వారి నిశ్చితార్థం జరగనుందనే విషయం. దీంతో సినీ ఇండస్ట్రీలో బిగ్ సర్‌ప్రైజ్‌గా ఈ జంట ఎంగేజ్‌మెంట్ మారింది.
ఇప్పటికే ఎన్నోసార్లు డేటింగ్ పుకార్లతో హైలెట్ అయిన నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఇవాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారనే రూమర్లతో హాట్ టాపిక్ అయ్యారు. ఇవాళ సాయంత్రం అత్యంత సన్నిహితుల మధ్య చైతూ, శోభితా నిశ్చితార్థం జరగనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అదే సాయంత్రం ఎంగేజ్‌మెంట్ అనంతరం నాగార్జున అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేయనున్నారని కూడా గట్టిగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తనకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళపై మామ నాగార్జున చేసిన పాత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2018లో అడవి శేష్ నటించిన గూఢచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శోభితా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ గూఢచారి సక్సెస్ మీట్‌లో శోభిత ధూళిపాళ గురించి నాగ చైతన్య తండ్రి నాగార్జున కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ పాత పాత వీడియోను ప్రస్తతం ఇంటర్నెట్ యూజర్లు బయటపెట్టారు. రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కాబోయే కోడలిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఓకే శోభితా ధూళిపాళ.. ఆమె చాలా బాగుంది. నేను ఇలా చెప్పకూడదు కానీ, ఆ సినిమాలో ఆమె చాలా హాట్‌గా ఉంది. నా ఉద్దేశ్యంలో ఆమెలో ఎంతో ఆకర్షణీయమైన విషయం ఉంది" అని నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు.
నాగార్జున కామెంట్స్‌కు పక్కనే స్టేజ్‌పై ఉన్న అడవి శేష్‌తోపాటు ఇతర ఆర్టిస్టులు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో నాగార్జున కామెంట్స్‌పై రెడిట్ యూజర్స్ నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. "అది 2018 నాటి వీడియో అయినప్పటికీ, అప్పుడు సమంత, నాగ చైతన్య కలిసి ఉన్నప్పటికీ ఒక కొత్త యంగ్ హీరోయిన్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం బాగోలేదు" అని ఒక యూజర్ రాసుకొచ్చారు.
"ఆమె ఆకర్షణీయంగా ఉందా లేదా అని చెప్పడం కాదు. పని గురించి చెప్పాలి" అని ఏడుస్తున్న ఎమోజీస్ షేర్ చేశాడు సదరు యూజర్. అయితే, మరొకరు నాగార్జునను సమర్థిస్తూ కామెంట్ చేశారు. "ఆమె ఒక నటి. అంతేకానీ ఆమె అతని కోడలా లేదా మరేదైనా అని కాదు" అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరో యూజర్ "సంబంధాలు మారుతుంటాయి" అని ఫన్నీగా కామెంట్ చేశారు.
"ఆమె ఒక నటి అని ఏదో అలా చెప్పారు. మీరు దాన్ని ఏదో గాసిప్ చేయాలని చూస్తున్నారు" అని ఒక యూజర్ అంటే.. "ఇప్పుడే బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మీరు" అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా శోభిత ధూళిపాళపై నాగార్జున చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్పమ స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే, నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో బిజిగా ఉన్నారు. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు.