Rashmika Mandanna: కుబేర నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్.. వచ్చేది ఆరోజే?-rashmika mandanna kubera first look release date announced officially with new poster rashmika mandanna kubera poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: కుబేర నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్.. వచ్చేది ఆరోజే?

Rashmika Mandanna: కుబేర నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్.. వచ్చేది ఆరోజే?

Sanjiv Kumar HT Telugu
Jul 03, 2024 10:15 AM IST

Rashmika Mandanna First Look Of Kubera Release Date: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప 2 తర్వాత నటిస్తోన్న మరో సినిమా కుబేర. నాగార్జున, ధనుష్ వంటి అగ్ర హీరోలు యాక్ట్ చేస్తున్న కుబేర మూవీ నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కుబేర నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్.. వచ్చేది ఆరోజే?
కుబేర నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్.. వచ్చేది ఆరోజే?

Rashmika Mandanna First Look From Kubera: నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా మూవీ 'కుబేర'. ఈ సినిమా ఇప్పుడు మోస్ట్ ఎవెయిటింగ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటిగా ఉంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేనితోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం నటిస్తున్న విషయం తెలసిందే. వీరితోపాటు జిమ్ సర్భ్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఇలా ప్రముఖ తారాగణం నటిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కుబేరను తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, కుబేర సినిమా నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల తేదిని అధికారింగా ప్రకటించారు. దీంతో రష్మిక మందన్నా అఫీషియల్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఇంటర్నెట్‌లో సంచలనం క్రియేట్ చేస్తూ ఈ మాగ్నం ఓపస్ కోసం ఎగ్జయిట్‌మెంట్‍‌ని మరింతగా పెంచేసింది. రష్మిక మందన్నా కుబేర ఫస్ట్ లుక్‌ను జూలై 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ విషయం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో రష్మిక పింక్ కలర్ సూట్ ధరించి, ఓ సూట్‌కేస్‌ని లాక్కెలుతున్నట్లుగా ఉంది. ఆమె పాత్ర ప్రతి సన్నివేశంలోనూ ఆసక్తిని కలిగిస్తుంది అని మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ కొత్త పోస్టర్‌ని విడుదల చేయడంతో పూర్తి లుక్‌ని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇప్పటికే కుబేర నుంచి విడుదలైన సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని ఫస్ట్ లుక్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనలు అందుకున్నాయి. నాగార్జున గ్లింప్స్ సినిమాపై పూర్తి ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. వర్షంలో చేతిలో గొడుగు పట్టుకుని నాగ్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఆ తర్వాత మిస్సైన డబ్బును భర్తీ చేస్తూ తన దగ్గర ఉన్న మనీ పెట్టడం క్యూరియాసిటీ కలిగించింది.

ఇదిలా ఉంటే, రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కుబేర మాత్రమే కాకుండా రష్మిక మందన్నా పుష్ప 2 మూవీ కూడా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కపుల్ రొమాంటిక్ సాంగ్ సూసేకి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ అనే మరో చిత్రం చేస్తుంది. ఇది లేడి ఒరియెంటెడ్ ఫిల్మ్. తన కెరీర్‌లో మొదటి సారి లేడి ఒరియెంటెడ్ సినిమా చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

WhatsApp channel