Rashmika Mandanna The Girlfriend: రష్మిక మందన్నా కొత్త మూవీ ది గర్ల్‌ఫ్రెండ్.. డిఫరెంట్‌గా ఫస్ట్ లుక్ వీడియో
Rashmika Mandanna The Girlfriend: రష్మిక మందన్నా కొత్త మూవీకి ది గర్ల్‌ఫ్రెండ్ అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు కాస్త డిఫరెంట్‌గా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు.
Rashmika Mandanna The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఆదివారం (అక్టోబర్ 22) మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీకి ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) అనే పేరు పెట్టారు. నేషనల్ అవార్డు విన్నర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో రష్మిక కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది. మొదట ఓ మేల్ వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. "దాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానంటే.. దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అవసరం లేదు రా.. నేను చాలు.. 24 హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది. నాది అని చెప్పుకోడానికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా" అనే వాయిస్ వస్తుంది.
ఆ తర్వాత నీటిలో మునిగిపోతున్న రష్మిక కనిపిస్తుంది. మొదట కాస్త నవ్వినట్లుగా.. తర్వాత ఊపిరిడానట్లుగా కనిపించే రష్మిక.. మూవీపై క్యూరియాసిటీ పెంచేసింది. ఓ గర్ల్‌ఫ్రెండ్, ఆమెను అతిగా ప్రేమించి బాయ్ ఫ్రెండ్, వాళ్ల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా స్టోరీ కనిపిస్తోంది. మన్మథుడు 2 మూవీ ఫ్లాప్ తర్వాత రాహుల్ రవీంద్రన్ చేస్తున్న డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు ఈ వీడియో చివర్లో మేకర్స్ చెప్పారు. ఈ సినిమాను విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఖుషీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు రష్మిక ఇప్పటికే టాలీవుడ్ లో పుష్ప 2, బాలీవుడ్ లో యానిమల్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యే యానిమల్ నుంచి రిలీజైన సాంగ్ లో రణ్‌బీర్ కపూర్ తో కలిసి ఆమె లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. ఇలాంటి సీన్లలో నటించడానికే రష్మిక భారీగా రెమ్యునరేషన్ తీసుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని రష్మిక టీమ్ స్పష్టం చేసింది.