Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్-nagarjuna kubera first look glimpse released in star sports srh vs rr ipl 2024 match live ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. Srh Vs Rr మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
May 03, 2024 01:23 PM IST

Kubera Nagarjuna First Look SRH vs RR IPL: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా. తాజాగా ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేశారు. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌లో రిలీజ్ చేయడం విశేషంగా మారింది.

కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్
కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Kubera Nagarjuna First Look Glimpse: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడుగా నేషనల్ అవార్డు విన్నర్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సోషల్ డ్రామా కుబేర. మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వేదికగా IPL 2024 ప్రసారం మధ్యలో విడుదల చేసిన నాగార్జున ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ IPL గేమ్ సమయంలో కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను టెలికాస్ట్ చేశారు.

ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని కళ్లద్దాలు పెట్టుకుని మ్యాన్లీగా కనిపించారు కింగ్ అక్కినేని నాగార్జున. అతని వెనుక ఓ ట్రక్కులో డబ్బు ఉండటం ఆసక్తిగా అనిపించింది. ఆ తర్వాత నడుచుకుంటూ వస్తుంటే రోడ్డుపై ఒక నోట్ పడి ఉంటుంది. అది చూసిన నాగార్జున వెనక్కి వెళ్లి తన పర్స్ నుంచి మరో నోట్ తీసి ఆ డబ్బు పక్కన పెడతాడు. ఆ డబ్బు నుంచి కొంత మిస్ అయినట్లు, దాన్ని భర్తీ చేసినట్లుగా సీన్ చూపించారు.

ఇది గ్లింప్స్‌లో చాలా హైలెట్‌గా నిలిచింది. అనంతరం నాగార్జున నవ్వుతూ నడుచుకుంటూ రావడం మిస్టీరియస్‌గా అనిపించింది. ఈ సన్నివేశం వెనుక ఉన్న అర్థం సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనిపిస్తుంది. చాలా పకడ్బందీగా ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నట్లు ఇప్పటికీ విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

ఇదివరకు కుబేర నుంచి మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన తమిళ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ లుక్‌కి మంచి ఆదరణ లభించింది. దీనికి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి థ్రిల్లింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ధనుష్ బికారిగా కనిపించిన విషయం తెలిసిందే. తాజా గ్లింప్స్‌లో నాగార్జున డబ్బున్న వ్యక్తిగా దర్శనం ఇచ్చాడు. ఈ రెండు పాత్రలతో సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కుబేరను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా కుబేర చిత్రంలో ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేనితోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌ నటిస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు కుబేర రిలీజ్ డేట్ ప్రకటించలేదు. రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత లేదా మిగతా పాత్రల పరిచయం తర్వాత విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇదివరకు నాగార్జున నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు.

నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ నా సామిరంగ మంచి వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది.

IPL_Entry_Point