Hanuman OTT Release: ఇవాళ మహా శివరాత్రి.. హనుమాన్ ఓటీటీ రిలీజ్ చేస్తారా? జీ5 సంస్థ ఆన్సర్ ఇదే!
Hanuman OTT Streaming Date: గురువారం నుంచి జీ5 ఓటీటీ సంస్థకు హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై ప్రశ్నలు వెల్లువ మొదలైంది. వీటన్నింటికి ఒకే ఆన్సర్ ఇస్తూ వస్తోంది జీ5 సంస్థ. అయితే తాజాగా శివరాత్రి సందర్భంగా ఇవాళ హనుమాన్‌ను ఓటీటీ రిలీజ్ చేస్తారా అని ఓ యూజర్ అడిగాడు. దానికి జీ5 ఏం చెప్పిందంటే..
Hanuman OTT Release Date: ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల్లో హనుమాన్ మూవీని ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారనే ప్రశ్నకు అంతుచిక్కడం లేదు. చాలా కాలంగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలిందనే చెప్పాలి. హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పటికీ అనేక రూమర్స్, డేట్స్ మారాయంటూ వార్తలు వచ్చాయి. జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన హనుమాన్ సినిమాను ఫిబ్రవరి నెలలోనే ఓటీటీ రిలీజే చేస్తారని సమాచారం వచ్చింది.
కానీ, తర్వాత థియేటర్లలో హనుమాన్‌కు ప్రేక్షకులు పోటెత్తడంతో సినిమాను 55 రోజులకు పెంచారు. ఇటీవల 150 థియేటర్లలో 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది హనుమాన్ సినిమా. ఈ సందర్భంగా ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే ఈ థియేట్రికల్ రన్ తర్వాత మార్చి 8న మహాశివరాత్రి (Maha Shivaratri 2024), జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా ఓటీటీలో హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. దీనిపై జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించినట్లు కూడా న్యూస్ వైరల్ అయింది.
అయితే, మార్చి 8కి ఒక రోజు ముందు మార్చి 7న పెద్ద ట్విస్ట్ ఇచ్చింది జీ5 (ZEE5) సంస్థ. సాధారణంగా ఒకరోజు ఓటీటీ రిలీజ్ ముందు ఆయా సంస్థలు సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్‌ను (Hanuman Digital Streaming) అధికారికంగా ప్రకటిస్తాయి. కానీ, హనుమాన్ విషయంలో అలా జరగకపోయేసరికి ఓ యూజర్ జీ5కి హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దానికి తమకు ఇంకా హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ రాలేదని రిప్లై ఇచ్చింది జీ5.
దీంతో హనుమాన్ చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అంతేకాకుండా ఇవాళ మార్చి 8. అయినా ఇప్పటివరకు హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో జీ5కి హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై ప్రశ్నలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే "దయచేసి ఇవాళ హనుమాన్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇవాళ మహా శివరాత్రి" అని పాల్సన్ వరుణ్ అనే యూజర్ జీ5కి మెసేజ్ చేశాడు.
అతని మెసేజ్‌కు ఇదివరకు ఇచ్చిన రిప్లైనే ఇచ్చింది జీ5 సంస్థ. "హాయ్.. మాకు ఇంకా హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ రాలేదు. మా వెబ్ సైట్‌ను తరచుగా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ హ్యాండిల్స్ ఫాలో అవ్వండి" అని జీ5 సంస్థ సమాధానం ఇచ్చింది. అయినా ఈ విషయంపై ప్రేక్షకుల నుంచి ప్రశ్నలు ఆగడం లేదు." హనుమాన్‌ను ఓటీటీలో ఎప్పుడూ రిలీజ్ చేస్తారో దయచేసి కన్ఫర్మ్ చేయండి" అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు.
ఇదిలా ఉంటే, హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు భారీ ధరకు జీ5 కొనుగోలు చేసినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇన్ సైడ్ టాక్. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వచ్చినట్లు ఇదివరకు ప్రచారం జరిగింది. కాగా హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా చేసిన విషయం తెలిసిందే.
హనుమాన్‌లో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రముఖ నటుడు వినయ్ రాయ్ విలన్‌గా చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.