Monkey Man: 'హనుమాన్‌'లా హాలీవుడ్ చిత్రం.. ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.. డైరెక్టర్‌గా మారిన హీరో-monkey man trailer release dev patel sobhita dhulipala ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Monkey Man: 'హనుమాన్‌'లా హాలీవుడ్ చిత్రం.. ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.. డైరెక్టర్‌గా మారిన హీరో

Monkey Man: 'హనుమాన్‌'లా హాలీవుడ్ చిత్రం.. ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.. డైరెక్టర్‌గా మారిన హీరో

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2024 12:53 PM IST

Monkey Man Trailer: ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తరహాలో హాలీవుడ్ నుంచి మంకీ మ్యాన్ అనే సినిమా రానుంది. హనుమంతుడి ఇతిహాసం స్ఫూర్తితో తెరకెక్కిన మంకీ మ్యాన్ చిత్రాన్ని ఇండియాలో చిత్రీకరించారు. తాజాగా మంకీ మ్యాన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

'హనుమాన్‌'లా ఇంగ్లీష్ చిత్రం.. ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.. డైరెక్టర్‌గా మారిన హీరో
'హనుమాన్‌'లా ఇంగ్లీష్ చిత్రం.. ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.. డైరెక్టర్‌గా మారిన హీరో

Dev Patel Monkey Man Trailer: హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చి ప్రజలను ఎలా కాపాడుతాడో, దానికి ఇండియన్ తొలి సూపర్ హీరోగా భావించే హనుమంతుడి ఇతిహాస స్ఫూర్తిని జోడించి తెరకెక్కించిందే తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హనుమాన్ మూవీ తరహాలోనే హాలీవుడ్ నుంచి ఓ సినిమా రానుంది.

హనుమంతుడిని స్ఫూర్తిగా

ఇతిహాసం కథల్లోని హనుమంతుడిని స్ఫూర్తిగా హాలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమా మంకీ మ్యాన్. ఈ మంకీ మ్యాన్ సినిమాలో దేవ్ పటేల్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవ్ పటేల్ హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్డాడు. అంటే మంకీ మ్యాన్ మూవీతో డైరెక్టర్‌గా మారాడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ, హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్ వంటి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ చిత్రాలతో చాలా పాపులర్ అయ్యాడు దేవ్ పటేల్.

హీరో-దర్శకత్వం-నిర్మాత

మంకీ మ్యాన్ మూవీకి దేవ్ పటేల్ హీరోగా, దర్శకత్వం చేస్తూ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాను ఇండియాలోని ముంబైలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్కువగా ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా మంకీ మ్యాన్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మొత్తం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా అనిపిస్తోంది. "నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది" అంటూ మంకీ మ్యాన్ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో హనుమంతుడి ఫొటోలు కనిపిస్తుంటాయి.

ప్రజల రక్షకుడు

"రాక్షస రాజు తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. అతనే ది వైట్ మంకీ" అని చెప్పి మంకీ మ్యాన్ స్టోరీ లైన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో హాలీవుడ్‌లోకి డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ. గూఢచారి, మేజర్ చిత్రాలతో ఆకట్టుకున్న శోభితా మంకీ మ్యాన్‌లో బార్ డ్యాన్సర్‌గా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. అలాగే దేవ్ పటేల్ వెయిటర్ రోల్ చేస్తున్నాడు.

మంకీ మ్యాన్ ఓటీటీ

మంకీ మ్యాన్ మూవీలో దేవ్ పటేల్, శోభితా ధూలిపాళతోపాటు మకరంద్ దేశ్ పాండే, సికందర్ ఖేర్, షార్లోటో కోప్లే, పిటోబాష్, విపిన్ శర్మ, అదితి కల్కుంటె, అశ్విని కల్సేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో మకరంద్ దేశ్ పాండే గురూజీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మంకీ మ్యాన్ మూవీని ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక మంకీ మ్యాన్ ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

మంకీ మ్యాన్ సాంకేతికవర్గం

హీరోగా చేస్తున్న దేవ్ పటేల్ మంకీ మ్యాన్ మూవీ స్టోరీ రాసుకుని స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. దేవ్ పటేల్‌కు దర్శకత్వంలో పాల్ అంగునవేల, జాన్ కొల్లీలు సహాయం అందిస్తున్నారు. మంకీ మ్యాన్ సినిమాను దేవ్ పటేల్‌తో పాటు జోమోన్ థామస్, జోర్డాన్ పీలే, విన్ రోసెన్ఫెల్డ్, ఇయాన్ కూపర్, బాసిల్ ఇవానిక్, ఎరికా లీ, క్రిస్టీన్ హేబ్లర్, అంజయ్ నాగ్పాల్ నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా జోనాథన్ ఫుహ్ర్మాన్, నటాలియా పావ్చిన్స్‌క్యా, ఆరోన్ ఎల్ గిల్బర్ట్, ఆండ్రియా స్ప్రింగ్, అలిసన్-జేన్ రోనీ, స్టీవెన్ థిబాల్ట్ వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point