Hanuman OTT Release: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా.. కొన్ని గంటల ముందు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జీ5 ఓటీటీ-hanuman ott release delayed again zee5 ott twist hours before super hero movie digital premier ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott Release: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా.. కొన్ని గంటల ముందు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జీ5 ఓటీటీ

Hanuman OTT Release: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా.. కొన్ని గంటల ముందు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జీ5 ఓటీటీ

Hari Prasad S HT Telugu
Mar 07, 2024 03:58 PM IST

Hanuman OTT Release: హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా? శుక్రవారం (మార్చి 8) ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఖాయం అనుకుంటున్న వేళ జీ5 పెద్ద షాకే ఇచ్చింది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా.. కొన్ని గంటల ముందు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జీ5 ఓటీటీ
హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందా.. కొన్ని గంటల ముందు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జీ5 ఓటీటీ

Hanuman OTT Release: సంక్రాంతి సినిమా హనుమాన్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందా? శుక్రవారం (మార్చి 8) ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడం లేదా? తాజాగా జీ5 (ZEE5) ఓటీటీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇవే ప్రశ్నలకు తావిస్తోంది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జీ5 స్పందిస్తూ.. హనుమాన్ మూవీపై తమకు ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.

హనుమాన్ మళ్లీ ఆలస్యం

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ మార్చి 8న ఓటీటీలోకి రాబోతోందని మార్చి 1న అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో మహా శివరాత్రి నాడు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో గురువారం (మార్చి 7) మధ్యాహ్నం జీ5 పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ ప్రీమియర్ సందిగ్ధంలో పడింది.

"హనుమాన్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కాస్త కన్ఫమ్ చేస్తారా" అని ఓ అభిమాని జీ5 (ZEE5)ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. దీనిపై జీ5 ఇండియా వెంటనే స్పందించింది. "హాయ్. ఈ విషయంలో మాకు ఎలాంటి అప్డేట్ లేదు. దయచేసి మా వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఓ కన్నేసి ఉంచండి" అని జీ5 రిప్లై ఇచ్చింది.

హనుమాన్ వస్తుందా రాదా?

జీ5 ఇచ్చిన ఈ రిప్లై ప్రేక్షకులను మరింత గందరగోళంలో పడేసింది. థియేటర్లలో రిలీజై 50 రోజులకుపైనే అయింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్లపై చూడని వాళ్లు ఓటీటీలో చూడటానికి ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జీ5 మూవీ డిజిటల్ ప్రీమియర్ పై సందేహాలు వ్యక్తం చేయడంతో అసలు హనుమాన్ వస్తుందా రాదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. గుంటూరు కారంతో పోటీ పడుతూ అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది. ఈ సూపర్ హీరో మూవీ డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. నిజానికి వారం కిందట జీ5 లోగోతో హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్తలు వచ్చాయి.

కానీ దీనిపై ఇప్పటి వరకూ జీ5 (ZEE5) మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా తమకు కూడా ఎలాంటి సమాచారం లేదని సదరు ఓటీటీ చెప్పడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం.

హనుమాన్ మార్చి 1నే ఓటీటీలోకి వస్తుందని భావించారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ ఆయా ఓటీటీల్లోకి వచ్చేశాయి. హనుమాన్ కోసం మాత్రం వెయిటింగ్, సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనిపై అర్ధరాత్రి వరకూ జీ5 మరేదైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.

IPL_Entry_Point