Weekend OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా మిస్ కావద్దు-weekend ott releases hanuman merry christmas maharani showtime movies and web series in netflix prime video hotstar zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Weekend Ott Releases Hanuman Merry Christmas Maharani Showtime Movies And Web Series In Netflix Prime Video Hotstar Zee5

Weekend OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu
Mar 07, 2024 02:56 PM IST

Weekend OTT Releases: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీతోపాటు ఈ శివరాత్రి లాంగ్ వీకెండ్ లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న హనుమాన్.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కావద్దు
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న హనుమాన్.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కావద్దు

Weekend OTT Releases: ఈసారి శివరాత్రి రావడంతో లాంగ్ వీకెండ్ లో చూడటానికి ఓటీటీల్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇందులో చాలా రోజులుగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ కూడా ఉంది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి రాబోతోంది. హనుమాన్ తోపాటు ఈ వీకెండ్ లో చూడటానికి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేశాయి.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ఈ వీకెండ్ లో హనుమాన్ మూవీతోపాటు మెర్రీ క్రిస్మస్, లాల్ సలామ్ సినిమాలు.. మహారాణి 3, షోటైమ్ వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ సినిమాలు, సిరీస్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీల్లో అడుగుపెడుతున్నాయి.

హనుమాన్ - జీ5 (మార్చి 8)

మరికొన్ని గంటల్లోనే అంటే గురువారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత (మార్చి 8) హనుమాన్ మూవీ జీ5 ఓటీటీలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లతో 90 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సంక్రాంతి సినిమాగా నిలిచింది హనుమాన్. ఇప్పుడీ సినిమా ఓటీటీలో చూడాలంటే వెంటనే జీ5 ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

లాల్ సలామ్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 8) రాబోతోంది. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

అన్వేషిప్పిన్ కండెతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

టొవినో థామస్ నటించిన మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండెతుమ్ కూడా శుక్రవారం (మార్చి 8) నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధం కావడంతో నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మెర్రీ క్రిస్మస్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన మరో థ్రిల్లర్ మూవీ మెర్రీ క్రిస్మస్. హిందీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా సినిమాకు మొదట్లో మంచి రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో అయినా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

మహారాణి 3 - సోనీలివ్ (మార్చి 7)

సోనీలివ్ ఓటీటీలో గురువారమే (మార్చి 7) మహారాణి సీజన్ 3 రిలీజైంది. తొలి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ పొలిటికల్ డ్రామా మూడో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మూడో సీజన్ కు కూడా మంచి రివ్యూలే వస్తున్నాయి.

షోటైమ్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (మార్చి 8)

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, మౌనీ రాయ్, నసీరుద్దీన్ షాలాంటి వాళ్లునటించిన వెబ్ సిరీస్ షోటైమ్. బాలీవుడ్ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మరో సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం (మార్చి 8) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp channel