Anweshippin Kandethum OTT Release Date: సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది..-anweshippin kandethum ott release date malayalam super hit crime thriller movie to stream in netflix from march 8th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anweshippin Kandethum Ott Release Date Malayalam Super Hit Crime Thriller Movie To Stream In Netflix From March 8th

Anweshippin Kandethum OTT Release Date: సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది..

Hari Prasad S HT Telugu
Mar 01, 2024 05:27 PM IST

Anweshippin Kandethum OTT release date: మలయాళంలో ఈ మధ్య రిలీజై సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. టొవినో థామస్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది
సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది

Anweshippin Kandethum OTT release date: తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైన మలయాళ హీరో టొవినో థామస్ నటించిన సూపర్ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్. ఈ మర్డర్ మిస్టరీ మూవీ థియేటర్లలో సక్సెసైంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి కూడా రాబోతోంది. డార్విన్ కురియాకోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

అన్వేషిప్పిన్ కండెతుమ్ ఓటీటీ రిలీజ్

టొవినో థామస్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 8 నుంచి అందుబాటులోకి రానుంది. మలయాళంలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలను బాగా ఇష్టపడుతున్న తెలుగు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూసే.

అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో టొవినో థామస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీలో హీరో రెండు భిన్నమైన కేసులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో అతనికి ఎదురైన సవాళ్లేంటి అన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో టొవినో థామస్ తోపాటు వినీత్ డేవిడ్, రాహుల్ రాజగోపాల్, సిద్దిఖీ, షమ్మి తిలకన్, సాదిఖ్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఈ సినిమాకు ఏకంగా 8.4 ఐఎండీబీ రేటింగ్ వచ్చింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా కలెక్షన్లు రావడం విశేషం. మర్డర్ మిస్టరీ సినిమాలను బాగా ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ నచ్చుతుంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ లోని మలయాళ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే కొన్ని అలరించే మలయాళ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఎ రంజిత్ సినిమా, సీబీఐ 5, ఇరట్టా, జన గన మన, కాసర్‌గోల్డ్, నాయట్టు, పులిమడ, వాశిలాంటి మలయాళ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నాయి. సినిమాలే కాకుండా ఈ మధ్య కర్రీ అండ్ సయనైడ్ అనే డాక్యుమెంటరీ సిరీస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కేరళలో ఓ గృహిణి చేసిన ఆరు హత్యల సంచలన కేసుపై రూపొందించారు.

WhatsApp channel