HanuMan OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ విషయంలో స్ట్రాటజీ ఇదేనా!
HanuMan Movie OTT Release: హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
HanuMan OTT Release: హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించింది. అంచనాలను కూడా దాటేసి భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో చిత్రానికి భారీ వసూళ్లతో పాటు ప్రశంసలు దక్కాయి. జనవరి 12వ తేదీన రిలీజైన హనుమాన్ ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
హనుమాన్ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం మార్చి 8వ తేదీన ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఇంకా స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, స్ట్రీమింగ్ విషయంలో మూవీ టీమ్ ఓ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.
స్ట్రాటజీ ఇదే!
హనుమాన్ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది. చిత్రానికి చాలా చోట్ల ఇంకా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ముందుగానే ప్రకటిస్తే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మూవీ టీమ్ భావిస్తోందట. అందుకే ముందస్తుగా పెద్దగా ప్రచార హడావుడి లేకుండానే ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మార్చి 8వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రావడం దాదాపు ఖాయమే అయినా.. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
హనుమాన్ సినిమాను ముందస్తు ప్రకటనలు లేకుండా సడెన్‍గా మార్చి 8న జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తుందని సమాచారం. లేకపోతే ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ డేట్ రావొచ్చు. అంతకంటే ముందే ఓటీటీ డేట్‍ను ప్రకటిస్తే.. ప్రస్తుతం థియేట్రికల్ రన్‍పై ఎఫెక్ట్ పడుతుందని ఆలోచిస్తోందట.
హనుమాన్ చిత్రానికి ఓటీటీలోనూ భారీ స్పందన రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటీటీ రికార్డులను కూడా ఈ చిత్రం సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి.
బాక్సాఫీస్ వసూళ్లు
హనుమాన్ సినిమా తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.40 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతికి రిలీజై అత్యధిక వసూళ్లను సాధించిన టాలీవుడ్ మూవీగా హనుమాన్ చరిత్ర సృష్టించింది. మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న టాప్-5 టాలీవుడ్ సినిమాల్లో నిలిచింది.
హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా చేశారు. హనుమంతుడి నుంచి ఉద్భవించిన మణి వల్ల అతీత శక్తులు పొందే యువకుడిగా ఈ చిత్రంలో తేజ నటించారు. ఆధ్యాత్మికతో ఈ సూపర్ హీరో చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు.
50 రోజుల వేడుకను కూడా హనుమాన్ మూవీ టీమ్ జరుపుకుంది. ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ వేడుకలో చెప్పారు.