Maha Shivaratri Movies OTT: ఓటీటీలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయండి!-list of maha shivaratri related movies in ott and youtube maha bhaktha siriyala bhakta kannappa sarvam shakthi mayam ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maha Shivaratri Movies Ott: ఓటీటీలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయండి!

Maha Shivaratri Movies OTT: ఓటీటీలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయండి!

Sanjiv Kumar HT Telugu
Mar 07, 2024 01:55 PM IST

Maha Shivaratri Related Movies In OTT: ఈ మహా శివరాత్రిని మరింత భక్తి శ్రద్ధలతో పూజించడానికి మంచి భక్తి పారవశ్య సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ మధ్య విడుదలైన శివుడిని కొలిచే సినిమాలను చూస్తూ ఎంచక్కా జాగారం చేసేయొచ్చు. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటంటే..

ఓటీటీలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయండి!
ఓటీటీలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయండి!

Maha Shivaratri 2024 OTT Movies: మహా శివుడిని ఎంతో దైవత్వంతో కొలిచే రోజు మహా శివరాత్రి. ఈ పర్వదినాన్ని పనస్కరించుకుని ఎంతోమంది భక్తులు ఉపవాసం, జాగరం ఉంటారు. రాత్రంతా ఆ శివుడిని ప్రసన్నం చేసుకుంటూ ఆయన నామాన్నే స్మరిస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఈ పర్వదినాన ఆ శివుడికి సంభంధించిన సినిమాలను ఓటీటీలో చూస్తూ నిద్రపోకుండా, ఎలాంటి కునుకుపాట్లు పడకుండా హ్యాపీగా జాగారం చేయొచ్చు. మరి ఏ ఓటీటీలో ఎలాంటి శివ భక్తి చిత్రాలు ఉన్నాయో తెలుసుకుందాం.

మహాభక్త సిరియాళ (Maha Bhaktha Siriyala)- డిస్నీ ప్లస్ హాట్ స్టార్

భక్త కన్నప్ప (Bhakta Kannappa) అమెజాన్ ప్రైమ్/యూట్యూబ్

భక్త సిరియాళ (Bhaktha Siriyala)- యూట్యూబ్

భక్త శంకర (Bhaktha Shankara)- (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు)

భక్త మార్కండేయ (Bhaktha Markandeya) యూట్యూబ్ (తెలుగు)/డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (కన్నడ)

 

శ్రీ మంజునాథ (Sri Manjunatha)- ఎరోస్ నౌ ఓటీటీ/యూట్యూబ్

ఉమాచండీ గౌరీశంకరుల కథ ( Uma Chandi Gowri Sankarula Katha)- ఈటీవీ విన్/యూట్యూబ్

కాళహస్తి మహత్యం (Kalahasti Mahatyam)- యూట్యూబ్

శివలీలలు (Shiva Leelalu Movie)/ యూట్యూబ్

దక్షయజ్ఞం (Dakshayagnam)- యూట్యూబ్

 

జగద్గురు ఆదిశంకర (Jagadguru Adi Shankara)- యూట్యూబ్

మావూళ్లో మహాశివుడు (Maa Voollo Shivudu)- యూట్యూబ్

శివకన్య (Shivakanya)- ఎరోస్ నౌ ఓటీటీ (Eros Now)/యూట్యూబ్

మహాశివరాత్రి (Maha Shivaratri Movie)- జీ5/యూట్యూబ్

శివరాత్రి మహత్యం (Shivaratri Mahatyam)-జియో సినిమా/యూట్యూబ్

స్పెషల్ సినిమాలు

వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ సినిమాలు ఎప్పుడు స్పెషల్ అయినప్పటికీ దివంగత నందమూరి తారకరత్న నటించిన మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. తారకరత్న, అర్చన నటించిన ఈ సినిమాను ఈ మహాశివరాత్రికి మంచి ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర కూడా మంచి ఎంపికే.

సర్వం శక్తిమయం

అయితే, శివభక్తి సినిమా కాకుండా ప్రపంచంలోని 18 శక్తి పీఠాలు గురించి చెప్పే సర్వం శక్తిమయం (Sarvam Shakthi Mayam OTT) వెబ్ సిరీస్ కూడా ఈ పర్వదినాన మంచి అనుభూతినిస్తుంది. ఫ్యామిలీ డ్రామాకు డివోషనల్ టచ్ ఉండే ఈ సిరీస్ జీ5, ఆహా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియమణి, సమీర్ సోని, సంజయ్ సూరి, సుబ్బరాజ్, అశ్లేష ఠాకూర్ (ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్) నటించిన ఈ సిరీస్‌ను కుటుంబంతో సహా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

సర్వం శక్తిమయం వెబ్ సిరీస్‌కు తెలుగు ప్రముఖ రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి క్రియేటర్‌గా ఉన్నారు. సర్వం శక్తిమయంకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. అలాగే సినిమాటోగ్రఫీ సజీష్ రాజేంద్రన్ బాధ్యతలు చేపట్టారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని నిర్మాతలుగా వ్యవహరించారు. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారానికి కుటుంబంతో కలిసి శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఎదురైన సమస్యలు, పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలోని మార్పు వంటి తదితర అంశాల చుట్టూ ఇది సాగుతుంది.

శక్తి పీఠాలు

అలాగే మరోవైపు దేవుడిపై నమ్మకం ఉంచకూడదు అనే పాయింట్‌తో బుక్ రాసేందుకు వచ్చిన నాస్తుకుడు ఎలా ఆస్తికుడుగా మారాడో సర్వం శక్తిమయం సిరీస్‌లో చూపించారు. సనాతన ధర్మం, భారతదేశంలోని 17 శక్తిపీఠాలతోపాటు శ్రీలంకలోని శక్తిపీఠాలకు ఉన్న ప్రాముఖ్యతను ఇందులో వివరించారు.

IPL_Entry_Point