Valari Movie Review: వళరి రివ్యూ.. తల్లిదండ్రులే దెయ్యాలయి భయపెడితే.. ఈటీవీ విన్ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?-ritika singh valari movie review in telugu and rating etv win ott valari review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Valari Movie Review: వళరి రివ్యూ.. తల్లిదండ్రులే దెయ్యాలయి భయపెడితే.. ఈటీవీ విన్ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Valari Movie Review: వళరి రివ్యూ.. తల్లిదండ్రులే దెయ్యాలయి భయపెడితే.. ఈటీవీ విన్ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 07, 2024 09:51 AM IST

Ritika Singh Valari Review In Telugu: వెంకటేష్ గురు సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది రితికా సింగ్. చాలా కాలం తర్వాత తెలుగులో మళ్లీ రితికా సింగ్ నటించిన సినిమా వళరి. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ ఎలా ఉందో వళరి రివ్యూలో తెలుసుకుందాం.

వళరి రివ్యూ.. గురు హీరోయిన్ ఓటీటీ హారర్ మూవీ భయపెట్టిందా?
వళరి రివ్యూ.. గురు హీరోయిన్ ఓటీటీ హారర్ మూవీ భయపెట్టిందా?

టైటిల్: వళరి

నటీనటులు: రితికా సింగ్, శ్రీరామ్, సుబ్బరాజు, ఉత్తేజ్, ప్రిన్సెస్ సహస్ర, పర్ణిత రుద్రరాజు తదితరులు

నిర్మాత: సత్యసాయి బాబా

డైరెక్టర్: మృతిక సంతోషిణి

సంగీతం: టీఎస్ విష్ణు, హరి గౌర

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్

ఎడిటింగ్: తమ్మిరాజు

ఓటీటీ: ఈటీవీ విన్

విడుదల తేది: మార్చి 6, 2024

Valari Movie Review Telugu: హీరో శ్రీరామ్, గురు హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూనిక్ హారర్‌ మూవీ వ‌ళ‌రి. ఈ సినిమాకు ఎం మృతిక సంతోషిణి అనే లేడి డైరెక్టర్ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన వళరి ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చాలా కాలం తర్వాత తెలుగులోకి ఇలా ఓటీటీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్. మరి ఈ హారర్ థ్రిల్లర్ వళరి ఎంతవరకు భయపెట్టంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ:

దివ్య (రితికా సింగ్) ఒక హౌజ్ వైఫ్. ఆమె భర్త నవీన్ (శ్రీరామ్) చెన్నైలో పని చేసే నేవి అధికారి. వీరికి మాదన్న అనే కుమారుడు ఉంటాడు. అయితే ఉద్యోగరీత్యా నవీన్‌కు కృష్ణపట్నం ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కృష్ణపట్నంలో నేవి క్వార్టర్స్‌లో దివ్య కుటుంబం ఉన్నప్పటికీ ఆ ఊరిలో ఉన్న పాత బంగ్లా మాత్రం దివ్యను ఆకర్షిస్తుంటుంది. అప్పటినుంచి దివ్యకు అనుకోని విచిత్ర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. తరచుగా 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులను చంపిన కల వస్తుంటుంది. జరగని విషయాలు జరిగినట్లు ఊహించుకుంటుంది.

ట్విస్టులు

అసలు దివ్యకు అలాంటి సంఘటనలు ఎందుకు ఎదురువుతున్నాయి? పాత బంగ్లాకు దివ్యకు ఉన్న సంబంధం ఏంటీ? అసలు దివ్య గతం ఏంటీ? ఆమె అసలు పేరు ఏంటీ? తన కొడుకుకి మాదన్న అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటీ? కలలో కనిపించే 13 ఏళ్ల బాలిక ఎవరు? ఆమె తన తల్లిదండ్రులను ఎందుకు చంపింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే వళరి మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

వళరి అనేది ఒక పురాతన ఆయుధం. కొడవలిలా షార్ప్‌గా ఉండి దాన్ని విసిరితే.. కొమ్మలు నరకడం నుంచి మనుషులను చంపేవరకు చేసి తిరికి మన చేతిలోకే వస్తుంది. అంటే ఇది ఒక బూమరాంగ్‌లా ఉంటుంది. చేసిన తప్పులకు కర్మ తిరిగి శిక్షిస్తుంది అన్నట్లుగా దాన్ని విసిరితే తిరిగి మన చేతిలోకే వస్తుంది. అలాగే సినిమా కథ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. సినిమా ప్రారంభంలో 13 ఏళ్ల బాలిక చేసిన దారుణ హత్యల గురించి చూపించి.. తను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుంది అన్నట్లుగా క్లైమాక్స్ వరకు సినిమాను నడిపించారు.

రెగ్యులర్ హారర్ థ్రిల్లర్

కానీ, అసలు ఏం జరిగింది అనేది క్లైమాక్స్‌లో రివీల్ చేసి మంచి ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలు స్క్రీన్ ప్లే, ఫార్ములా అంతే ఒకేలా ఉంటుంది. కానీ, వివిధ రకాలుగా స్టోరీ, కథా నేపథ్యం మారుతూ ఉంటుంది. వళరి కూడా అంతే. డిఫరెంట్ స్టోరీ అండ్ ఫ్లాష్‌బ్యాక్‌తో ఉన్నప్పటికీ రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ మూవీ వళరి. అయితే హరర్ సినిమాలను ఎంత గ్రిప్పింగ్‌గా, భయపెట్టేలా తెరకెక్కిస్తే అంతగా వర్కౌట్ అవుతుంది. అందులో డైరెక్టర్ సంతోషిణి పూర్తి స్థాయిలో కాకున్న బాగానే సక్సెస్ అయ్యారు.

మహిళను స్ట్రాంగ్‌గా చూపిస్తూ

మరీ ఎక్కువగా భయపెట్టే సీన్స్ లేకున్నా కొన్ని చోట్ల మాత్రం భయెపెడుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఉమెన్‌ను స్ట్రాంగ్‌గా చూపించిన విధానం చాలా బాగుంది. దివ్య తల్లి కర్రసాము విన్యాసాలు హైలెట్ అని చెప్పొచ్చు. వళరి హారర్ కంటే ఎమోషనల్‌గా బాగుంటుంది. అయితే, మొదట్లో ఇంట్రెస్టింగ్‌గా మొదలుపెట్టిన కొన్ని సీన్స్ రెగ్యులర్‌గా సాధారణంగానే ఉన్నాయి. కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాయి. ఇక కొన్నిసీన్స్ ఎందుకు పెట్టారనేది క్లారిటీ ఇవ్వలేదు.

హైలెట్‌గా కర్రసాము ఫైటింగ్

కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉంది. వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇక బీజీఎమ్, సంగీతం హారర్ మూవీకి తగినట్లుగా ఉన్నాయి. సీన్స్‌కి తగినట్లు ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే నవీన్ షిప్‌లో ప్రయాణించేటప్పుడు తెరకెక్కించిన సీన్స్ సీజీ అని క్లియర్‌గా తెలిసిపోతుంది. దివ్య అండ్ దివ్య తల్లిగా రితికా సింగ్ అదరగొట్టింది. సినిమాకు మెయిన్ హైలెట్ రితికా సింగ్. సీన్‌కు తగిన ఎమోషన్, థ్రిల్లింగ్ ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఇక కర్రసాము ఫైటింగ్ సీన్‌లో అదరగొట్టిందనే చెప్పొచ్చు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

శ్రీరామ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఉత్తేజ్, సుబ్బరాజు, బాలనటీనటులు కూడా తమ పర్ఫామెన్స్‌‌తో అలరించారు. ఫైనల్‌గా చెప్పాలంటే (Valari Review) ఈటీవీ విన్‌లో (ETV Win OTT) స్ట్రీమింగ్ అవుతోన్న వళరి మూవీని వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి టైమ్ పాస్‌ కోసం చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Whats_app_banner