Kubera Movie: ఫిలాసఫీపై కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కుబేర! డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?-sekhar kammula about dhanush nagarjuna kubera movie and philosophy over 25th years film journey ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kubera Movie: ఫిలాసఫీపై కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కుబేర! డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?

Kubera Movie: ఫిలాసఫీపై కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కుబేర! డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 02:07 PM IST

Sekhar Kammula About Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల కామెంట్స్ చేశారు.

ఫిలాసఫీపై కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కుబేర! డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?
ఫిలాసఫీపై కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కుబేర! డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?

Sekhar Kammula 25 Years Film Journey: తెలుగు దర్శకుల్లో మంచి విలువలతో సినిమాలు తీసే డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన కెరీర్‌లో హ్యాపీ డేస్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించి 25 ఏళ్లు కావొస్తుంది. ఈ సందర్భంగా తన కెరీర్, కుబేర సినిమాలకు సంబంధించిన విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మీ కెరీర్ మీకు చాలా స్లోగా అనిపించిందా?

నాకు అలా అనిపించలేదు. నేను సినిమా చేసే పద్దతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటాను. చెప్పేది సూటిగా ఉంటుంది. మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా తొందరగా చేయాలనుకోను. అలా చేస్తే గడిబిడి అయిపోతాం.

ఈ రోజుల్లో హిట్ రాగానే దర్శకులు చాలా ముందుంటున్నారు?

నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. మేకింగ్ పరంగాచాలా ఫాస్ట్‌గా ఉంటాను. కానీ, థింకింగ్ పరంగా స్లోగా ఉంటాను.

ఏషియన్ బ్యానర్‌తో మీ జర్నీ చాలా కంఫర్ట్‌గా ఉందనిపిస్తుంది?

నాకు వారితో జర్నీ అలా మొదలైంది. ఫ్రీడం, నమ్మకం అనేది ఇరువురి మధ్య ఉండాలి. అది కూడా మంచి పరిణామమే.

ధనుష్, నాగార్జున గారితో పెద్ద సినిమా చేస్తున్నారు? మీ నుంచి ఏ స్థాయిలో ఆశించవచ్చు?

ఇది పెద్ద స్కేల్ సినిమా. పెద్ద ఐడియాతో ఉండే సినిమాగా ఉంటుంది. ముందుగా చెప్పకూడదు. కానీ, నాగార్జున, ధనుష్ అనే వారు కథకు యాప్ట్ అని చేస్తున్నా. ఫిలాసఫీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది.

దర్శకుడికి ఎత్తు పల్లాలు ఉండటం మామూలే. మీ నుంచి నోస్ చెప్పాలంటే ఏం చెబుతారు.

నా సినిమాలో కల్ట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. పని, పాపులారిటీ మనం చేసే విధానంతో వస్తాయి. మనీ పరంగా ఆలోచించకుండా చేయడమే నా తత్వం. అదే నాకు గొప్పగా అనిపిస్తుంది.

నేషనల్ అవార్డు అందుకున్నారు. మరలా రీచ్ అయ్యే ఆలోచన ఉందా?

అలా అనుకోలేదు. నేను కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నాను. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. ప్రజలు ఇచ్చే అవార్డే గొప్పది. అవార్డు అనేది సడెన్‌గా వస్తుంటాయి. మనకంటే బెటర్‌గా సినిమాలు నేషనల్ లెవల్‌లో ఉంటున్నాయి. వాటినీ అంగీకరించాలి. ఏడాది ఏడాదికి జాతీయ స్థాయిలో అంచనాలు మారుతుంటాయి. కంటెంట్ పరంగా మంచిది తీసుకుని చేయడమే మన పని.

నేడు పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?

కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు చెప్పగలగాలి. కోవిడ్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ మారింది. వాటికి తగినట్లు సినిమా తీస్తే తప్పకుండా ఆ లెవల్‌కు చేరుతుంది. ఇందుకు ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా గమనించాలి అని ఇంటర్వ్యూ ముగించారు శేఖర్ కమ్ముల.

ఇదిలా ఉంటే, కుబేర సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నారు. అలాగే ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన కుబేర టైటిల్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అందరి ఆదరణ పొందింది.