IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వీళ్ల దగ్గరే-ipl 2024 points table orange cap and purple cap holders rajastan royals on top chennai super kings in 2nd position ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వీళ్ల దగ్గరే

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వీళ్ల దగ్గరే

Hari Prasad S HT Telugu
Mar 25, 2024 12:43 PM IST

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 ఒక రౌండ్ మ్యాచ్ లు ముగిశాయి. ఆదివారం (మార్చి 24) రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉంది.

ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వీళ్ల దగ్గరే
ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వీళ్ల దగ్గరే (ANI)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఫస్ట్ వీకెండ్ ముగిసింది. గత శుక్రవారం (మార్చి 22) మొదలైన ఈ మెగా లీగ్ లో తొలి మూడు రోజుల్లో ఐదు మ్యాచ్ లు జరిగాయి. దీంతో లీగ్ లోని మొత్తం పది జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి. ఈ రౌండ్ తర్వాత ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉంది. ఇక ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరి దగ్గర ఉన్నాయో చూడండి.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్
ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉంది. ఆ టీమ్ తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను 20 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో సంజూ శాంసన్ టీమ్ 2 పాయింట్లు 1.000 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉంది. ఇక రెండో స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఉంది.

సీఎస్కే ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీపై గెలిచింది. 2 పాయింట్లే ఉన్నా నెట్ రన్‌రేట్ (0.779) మాత్రం కాస్త తక్కువగా ఉంది. మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ (0.455 నెట్ రన్ రేట్), నాలుగోస్థానంలో గుజరాత్ టైటన్స్ (0.300), ఐదో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (0.200) ఉన్నాయి. ఈ ఐదు జట్లూ తమ తొలి మ్యాచ్ లలో విజయాలు సాధించాయి.

ఇక తొలి మ్యాచ్ లలో ఓడిన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఆరు నుంచి పది స్థానాల వరకు ఉన్నాయి. సోమవారం (మార్చి 25) మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, 9వ స్థానంలో ఉన్న ఆర్సీబీ మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 2024లో రెండో రౌండ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఎవరి దగ్గరంటే..

అన్ని టీమ్స్ ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. తొలి రౌండ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 82 పరుగులతో టాప్ లో ఉన్నాడు. అతడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో చెలరేగిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్ల లిస్టులో రసెల్ (64), నికొలస్ పూరన్ (64) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లో ఉన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై), నటరాజన్ (సన్ రైజర్స్), హర్షిత్ రాణా (నైట్ రైడర్స్) మూడేసి వికెట్లతో రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్ 2024 తొలి రౌండ్లోనే కొన్ని అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ లాంటి జట్లు ఓడిపోవడం, సన్ రైజర్స్ పై నైట్ రైడర్స్ చివరి బంతికి విజయం సాధించడంలాంటి థ్రిల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇంకా రెండు నెలలపాటు లీగ్ కొనసాగనుంది. దీంతో ఈసమ్మర్ లో మరిన్ని థ్రిల్స్, పాయింట్ల టేబుల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి.

Whats_app_banner