IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. యశస్వికి ఈసారి ఖాయమేనా? గిల్ పోటీ ఇస్తాడా?-ipl 2024 orange cap yashasvi jaiswal shubman gill virat kohli ruturaj gaikwad in race who will win orange cap ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. యశస్వికి ఈసారి ఖాయమేనా? గిల్ పోటీ ఇస్తాడా?

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. యశస్వికి ఈసారి ఖాయమేనా? గిల్ పోటీ ఇస్తాడా?

Mar 12, 2024, 08:52 AM IST Hari Prasad S
Mar 12, 2024, 08:52 AM , IST

  • IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ గెలిచేది ఎవరు? ఈసారి రేసులో ప్రధానంగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. ఈ ఇద్దరూ టాప్ ఫామ్ లో ఉండటంతో వీళ్ల మధ్య క్యాప్ కోసం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి లీగ్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచేది ఎవరన్న చర్చ మొదలైంది. ఈ క్యాప్ గెలిచే అవకాశం ఉన్న టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం.

(1 / 6)

IPL 2024 Orange Cap: టాప్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ఈ ఏడాది ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో అందరి కంటే ముందు ఉంటాడనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో అతడు ఏకంగా 712 రన్స్ చేశాడు. ఇక గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ లలో 625 రన్స్ చేసిన యశస్వి.. ఈసారి కూడా లీగ్ టాప్ స్కోరర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

(2 / 6)

IPL 2024 Orange Cap: ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ కూడా టాప్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్లో 17 మ్యాచ్ లలో 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక పరుగుల రికార్డు ఇది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న శుభ్‌మన్ గిల్.. ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో కచ్చితంగా ఉంటాడు. ఈసారి హార్దిక్ కూడా లేకపోవడంతో కెప్టెన్సీ భారం కూడా అతనిపైనే ఉంది.

(3 / 6)

IPL 2024 Orange Cap: ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ తో సిరీస్ మొత్తానికీ దూరమై ఐపీఎల్ కు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కోహ్లి కూడా ఈ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండనున్నాడు. ప్రతి ఐపీఎల్ సీజన్లో 300కుపైగానే రన్స్ చేసిన ఘనత అతని సొంతం. గతేడాది కూడా 52.25 సగటుతో 639 రన్స్ చేశాడు. 2016లో 973 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ గెలిచిన కోహ్లి.. ఈసారి రేసులో ఉండే అవకాశం ఉంది.

(4 / 6)

IPL 2024 Orange Cap: గతేడాది చెన్నైసూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రుతురాజ్ గై్క్వాడ్ కూడా ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండనున్నాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఈసారి అతడు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. గత సీజన్లో 16 మ్యాచ్ లలో 590 రన్స్ చేశాడు.

(5 / 6)

IPL 2024 Orange Cap: గత సీజన్లో విఫలమైనా.. అంతకుముందు 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చెలరేగాడు జోస్ బట్లర్. ఆ సీజన్లో అతడు 17 మ్యాచ్ లలో 863 రన్స్ చేశాడు. ఈసారి ఆ టీమ్ తరఫున యశస్వితో కలిసి బట్లర్ కూడా కీలకం కానున్నాడు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు