IPL 2024 finals : మే 26న.. చెన్నైలో ఐపీఎల్ ఫైనల్స్!
IPL 2024 schedule : ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగొచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ వివరాలపై ఊహాగానాలు జరుగా సాగుతున్నాయి.
IPL 2024 final date : ఐపీఎల్ 2024 సగం షెడ్యూల్‌ని మాత్రమే ప్రకటించింది బీసీసీఐ. మిగిలిన సగాన్ని.. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ మిగిలిన సీజన్‌ని విదేశాల్లో నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్‍లో మిగిలిన సగం కూడా ఇండియాలోనే ఉంటుంది! అంతేకాదు.. మే 26న చెన్నై వేదికగా ఫైనాల్ మ్యాచ్ జరుగుతుంది. ఇది క్రికెట్ లవర్స్‌తో పాటు సీఎస్కే ఫ్యాన్స్‌కి జోష్ఇస్తోంది.

చెన్నైలో ఐపీఎల్ 2024 ఫైనల్స్..
ఐపీఎల్‍లో అనాదిగా.. ఒక సంప్రదాయం ఉంది. ముందు సీజన్లో కప్ గెలిచిన జట్టు.. తదుపరి సీజన్ మొదటి మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహిస్తుంది. అందుకు తగ్గట్టుగానే.. ఈసారి ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ చెన్నై (2023 ఐపీఎల్ విన్నర్ సీఎస్కే)లో జరిగింది. ఇక బీసీసీఐ సోర్స్ ప్రకారం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే ఉంటుంది.
"ఐపీఎల్ 2024 ఫైనల్ చెన్నైలో జరగొచ్చు. ఇక దేశంలోనే అతిపెద్ద స్టేడియం.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఒక క్వాలిఫయర్, ఎలిమినేటర్ జరగొచచు. మరొక క్వాలిఫయర్.. చెన్నైలోనే జరుగుతుంది," అని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:- IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!
IPL 2024 final match venue : చెన్నై అన్నా, చెన్నై సూపర్ కింగ్స్ అన్నా ముందుగా గుర్తొచ్చేది.. మహేంద్ర సింగ్ ధోనీ. పైగా.. ఇదే అతని చివరి ఐపీఎల్ అని వార్తలు జోరుగా సాగుతున్నాయి. మహేంద్రుడు తన కెప్టెన్సీని వదులుకోవడం.. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ తరుణంలో.. చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్న వార్తలు.. సీఎస్కే, ధోనీ అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది. ఈసారి సీఎస్కే ఫైనల్‌కి వెళ్లాలని, ఎంఏ చిదంబరం స్టేడియంలో గెలిచి, ధోనీకి గ్రాండ్‌గా గిఫ్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
IPL 2024 final schedule : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. వీటిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ఐపీఎల్ 2024 మిగిలిన షెడ్యూల్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
‘ధోనీ సగం మ్యాచ్‌లే ఆడతాడు..!’
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడింది చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నై జట్టు బోణీ కొట్టింది. అయితే.. మ్యాచ్‌కి ముందు జరిగిన కామెంటరీలో గ్రిస్ గేల్.. ధోనీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇవి ధోనీ ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
"ఐపీఎల్‍లో ధోనీ అన్ని మ్యాచ్‍లు ఆడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవచ్చు. అందుకే ఆ నిర్ణయం (కెప్టెన్సీని వదలుకోవడం) తీసుకుని ఉండొచ్చని నాకు అనిపిస్తోంది," అని అన్నాడు క్రిస్ గేల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం