IPL Purple Cap Winners: ఐపీఎల్ 16 సీజన్లలో పర్పుల్ క్యాప్ విన్నర్లు వీళ్లే.. తన్వీర్ నుంచి షమీ వరకు..
IPL 16 Seasons Purple Cap Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ తరుణంలో గత ఐపీఎల్ 16 సీజన్లలో పర్పుల్ క్యాప్ (ఆ సీజన్‍లో అత్యధిక వికెట్లు) దక్కించుకున్న బౌలర్లు ఎవరో ఇక్కడ ఫుల్ లిస్ట్ చూడండి.
(1 / 16)
ఐపీఎల్ తొలి సీజన్ 2008లో పాకిస్థాన్ బౌలర్ సోహెల్ తన్వీర్.. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 11 మ్యాచ్‍ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఐపీఎల్ ఎడిషన్‍లో పర్పుల్ క్యాప్‍ను దక్కించుకున్నాడు. 2008లో రాజస్థాన్ టైటిల్ గెలువడంలో కీలకపాత్ర పోషించాడు. (AFP)
(2 / 16)
ఐపీఎల్ 2009లో డక్కన్ చార్జర్స్ జట్టు తరఫున భారత పేసర్ ఆర్పీ సింగ్ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఆ సీజన్‍లో 16 మ్యాచ్‍ల్లోనే 23 వికెట్లతో సింగ్ సత్తాచాటాడు. ఆ ఏడాది డెక్కన్ ఛార్జెస్ చాంపియన్‍గా నిలిచింది. పర్పుల్ క్యాప్ దక్కించుకున్న తొలి భారత బౌలర్‌గా ఆర్పీ సింగ్ నిలిచాడు. (AFP)
(3 / 16)
ఐపీఎల్ 2010 సీజన్‍లో డక్కన్ ఛార్జర్స్ జట్టు తరఫున భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 16 మ్యాచ్‍ల్లో 21 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు.(AFP)
(4 / 16)
ఐపీఎల్ 2011 ఎడిషన్‍లో శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ.. ముంబై ఇండియన్స్ తరఫున 28 వికెట్లు తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. (AFP)
(5 / 16)
2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బౌలర్ మార్న్ మార్కెల్ (దక్షిణాఫ్రికా) 25 వికెట్లు దక్కించుకొని ఆ సీజన్ ఐపీఎల్‍లో పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు.(BCCI)
(6 / 16)
ఐపీఎల్ 2013 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వైన్ బ్రావో విజృంభించాడు. 18 మ్యాచ్‍ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. (BCCI)
(7 / 16)
2014లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ 16 మ్యాచ్‍ల్లో 23 వికెట్లు పడొగొట్టి.. పర్పుల్ క్యాప్ విన్నర్ అయ్యాడు. (BCCI)
(8 / 16)
2013 ఐపీఎల్ సీజన్‍లో 26 వికెట్లను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వైన్ బ్రావో పడగొట్టాడు. రెండోసారి పర్పుల్ క్యాప్‍ను అందుకున్నాడు. (BCCI)
(9 / 16)
ఐపీఎల్ 2016 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 17 మ్యాచ్‍ల్లో 23 వికెట్లను కైవసం చేసుకున్నాడు. ఆ ఏడాది పర్పుల్ క్యాప్‍ను దక్కించుకున్నాడు. (BCCI)
(10 / 16)
2017 ఐపీఎల్ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా రెండు ఎడిషన్లలో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. (BCCI)
(11 / 16)
ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై.. ఐపీఎల్ 2018 సీజన్‍లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున 24 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.(BCCI)
(12 / 16)
2019 ఐపీఎల్ సీజన్‍లో దక్షిణాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 17 మ్యాచ్‍ల్లో 26 వికెట్లు తీసుకున్నాడు. ఆ ఎడిషన్‍లో అత్యధిక వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. (BCCI)
(13 / 16)
ఐపీఎల్ 2020 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పేసర్ కగిసో రబాడా 30 వికెట్లతో సత్తాచాాటాడు. దీంతో పర్పుల్ క్యాప్‍ను ఈ దక్షిణాఫ్రికా స్టార్ హస్తగతం చేసుకున్నాడు. (BCCI)
(14 / 16)
2021 ఐపీఎల్ సీజన్‍లో భారత యంగ్ పేసర్ హర్షల్ పటేల్.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున 32 వికెట్లు తీసుకొని.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్‍లో ఒక సీజన్‍లో అత్యధిక వికెట్ల బ్రావో రికార్డును కూడా సమం చేశాడు. (BCCI)
(15 / 16)
ఐపీఎల్ 2022 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 27 వికెట్లతో అదరగొట్టి.. పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. (BCCI)
ఇతర గ్యాలరీలు