Rashmika Mandanna: అటు పుష్ప 2 - ఇటు కుబేర - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రష్మిక!
Rashmika Mandanna: బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్‌లతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇన్నాళ్లు పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొన్న ఈ కూర్గ్ బ్యూటీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండానే ధనుష్ బైలింగ్వల్ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది.
(1 / 5)
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
(2 / 5)
కుబేర షూటింగ్ ముంబైలో మొదలైంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది రష్మిక మందన్న. ధనుష్, రష్మికలపై లవ్‌సీన్స్‌ను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్నారు.
(3 / 5)
ధనుష్ జోడీగా రష్మిక నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే. కుబేర మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది రష్మిక.
(4 / 5)
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇతర గ్యాలరీలు