Nagarjuna Amala: అమల వంట చేయదు.. నేనే చేసుకుంటా.. ఎందుకంటే? నాగార్జున కామెంట్స్ వైరల్-nagarjuna comments on amala cooking in naa saami ranga interview and nagarjuna amala marriage anniversary tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna Amala: అమల వంట చేయదు.. నేనే చేసుకుంటా.. ఎందుకంటే? నాగార్జున కామెంట్స్ వైరల్

Nagarjuna Amala: అమల వంట చేయదు.. నేనే చేసుకుంటా.. ఎందుకంటే? నాగార్జున కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu

Nagarjuna About Amala Cooking: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య హీరోయిన్ అమల తనకు నచ్చిన వంట చేసి పెట్టదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది ఎందుకో కూడా కారణం చెప్పారు నాగ్. అయితే గతంలో అమల వంటపై నాగార్జున చేసిన కామెంట్స్ నాగార్జున అమల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.

అమల వంట చేయదు.. నేనే చేసుకుంటా.. ఎందుకంటే? నాగార్జున కామెంట్స్

Nagarjuna Amala Marriage Anniversary: టాలీవుడ్ కింగ్, మన్మథుడుగా నాగార్జున పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా యువ సామ్రాట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన స్టార్ హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున అంతకుముందు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు హోస్ట్‌గా వ్యవహరించి ఎంటర్టైన్ చేశారు.

నాగార్జున మ్యారేజ్ యానివర్సరీ

ఇదిలా ఉంటే, హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ వీరిద్దరి వివాహం 1992 జూన్ 11న జరిగింది. అంటే నాగార్జున-అమల వివాహబంధంలోకి అడుగుపెట్టి 32 సంవత్సరాలు కావొస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం (జూన్ 11) నాగార్జున, అమల్ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. అయితే, ఈ క్రమంలో గతంలో అమల వంటపై నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పూర్తిగా భిన్నంగా

ఓ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున తినడంపై యాంకర్ ప్రశ్నించారు. దానికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. "ఇగ పోయేటప్పుడు ఇంకో ముచ్చట అడుగుతాను సారు.. ఏమనుకోకండి. ఇప్పుడు పోయి ఏం తింటవ్. నేను పొద్దున ఇంత.. మధ్యాహ్నం ఇంతా.. రాత్రి ఇంతా.. గట్టిగా తింటా" అన్నట్లుగా యాంకర్ తెలిపారు. దానికి బాగా నవ్వేసిన నాగార్జున యాంకర్ తినడానికి పూర్తిగా భిన్నంగా చెప్పారు.

వంట చేయదా అమల మేడమ్

పొద్దున ఎక్కువ తిని క్రమంగా రాత్రి వరకు చాలా తక్కువ తింటానని నాగార్జున తెలిపారు. దానికి "తిని తిననట్టుగా. ఎందుకు సార్ వంట చేయదా అమల మేడమ్" అని యాంకర్ అడుగుతారు. దానికి బాగా నవ్వేస్తారు నాగార్జున. "ఏంటీ సార్ మరి పొద్దున మిగిలింది రాత్రి తిన్నట్లు అంతే తింటాను అంటున్నరు. అమల మేడమ్ పొద్దున ఒక్కపూటనే వంట చేస్తున్నట్లున్నరు.. రాత్రికి సార్‌కు అన్నం ఉండట్లే" అని యాంకర్ అంటారు.

వెజిటేరియనే వండుతుంది

"అంటే ఆమె చేస్తే కేవలం వెజిటేరియనే వండుతుంది. అది సమస్య" అని అమల వంట చేయదన్నట్లుగా నాగార్జున చెప్పారు. దాంతో "రేపు రండి మా ఇంటికి సార్ మంచిగా తలకాయ కాళ్లు సోరువ చేస్తా" అని ఇన్వైట్ చేస్తారు యాంకర్. దానికి నవ్వుతూ సరేనని నాగార్జున అంటారు. ఇదే ఇంటర్వ్యూలో "అమల వంట చేస్తుంది. కానీ, నాకు నచ్చిన వంట చేసి పెట్టదు. తను వెజిటేరియన్. మాంసం ముట్టదు. మొదటి నుంచి కూడా ఆమె అలాగే ఉంది. నేను ఇంట్లో చికెన్ తింటా. కానీ, తను చేయదు" అని నాగార్జున తెలిపారు.

బంగారం ఇచ్చేస్తుంది

అలాగే "బట్టలు, నగలు ఇక్కడ కొంటారా, విదేశాల్లో కొంటారా" అన్నదానికి.. "ఇక్కడ కష్టం. విదేశాల్లోనే షాపింగ్ చేస్తాం. ఇక నగలు విషయానికొస్తే అమలకు బంగారం అంటే ఇష్టముండదు. బంగారం కొంటే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తుంది. కుక్కలకు కూడా నాన్ వెజ్ పెట్టదు" అని నాగార్జున చెప్పుకొచ్చారు.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో

కాగా ఈ ఇంటర్వ్యూ నా సామిరంగ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగింది. ఈ ఇంటర్వ్యూకి నాగార్జునతోపాటు సినిమాలోని హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా హాజరయ్యారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ దిల్లాన్ సైతం నటించిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.