Pushpa 2 Second Single: పుష్ప 2 డ్యూయెట్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. 'సూసెకి' అంటూ పాట పాడిన రష్మిక మందన్నా-pushpa 2 the rule second single release date time fix rashmika mandanna sung suseki song in teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Second Single: పుష్ప 2 డ్యూయెట్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. 'సూసెకి' అంటూ పాట పాడిన రష్మిక మందన్నా

Pushpa 2 Second Single: పుష్ప 2 డ్యూయెట్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. 'సూసెకి' అంటూ పాట పాడిన రష్మిక మందన్నా

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 01:58 PM IST

Pushpa 2 Second Single Soseki Teaser: పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సింగిల్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర్జున్, రష్మిక మందన్నా మధ్య ఉండే సూసేకి అంటూ సాగే డ్యూయెట్ సాంగ్ టీజర్‌ను వినూత్నంగా విడుదల చేశారు.

పుష్ప 2 డ్యూయెట్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. 'సూసెకి' అంటూ పాట పాడిన రష్మిక మందన్నా
పుష్ప 2 డ్యూయెట్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. 'సూసెకి' అంటూ పాట పాడిన రష్మిక మందన్నా

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, స్పెషల్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ సాంగ్ అదిరిపోయాయి. సినిమాలో మొదటి సింగిల్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తాజాగా రెండో సింగిల్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గురువారం (మే 23) పుష్ప ది రూల్ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్ సూసెకి‌టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ వినూత్నంగా వినోదభరితంగా ఉంది. ఈ వీడియోలో, రష్మిక మందన్న సినిమా సెట్‌లో షాట్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. కేశవ ఆమె పాత్ర శ్రీవల్లి పేరుతో పిలుస్తాడు.

పుష్ప నుండి రెండో సింగిల్ సాంగ్ గురించి అడుగుతాడు కేశవ. అప్పుడు పాటలోని పల్లవిని పాడి వినిపిస్తుంది రష్మిక మందన్నా. అ్పపుడే సూసెకి పాట విడుదల తేది, సమయం చెబుతూ అనౌన్స్ చేశారు. వీడియో ఆ తర్వాత ఐకానిక్ పుష్ప బ్రాండ్ హ్యాండ్ లోగోను ఆకర్షణీయంగా చూపించారు. ఈ రెండో పాటను మే 29న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

ఈ పాటలో శ్రీవల్లి (రష్మిక మందన్న), ఆమె సామి (పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్) ఇద్దరూ మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది. ఇది వీరిద్దరి మధ్య డ్యూయెట్ సాంగ్ ఉండునున్నట్లు సమాచారం. ఇదివరకు పుష్పలో నా సామి పాట తరహాలో సూసెకి ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, పుష్ప 2 టీజర్ తరువాత సినిమా నుంచి మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట అన్ని భాషలలో భారీ హిట్ అయ్యింది. మ్యూజిక్ చార్ట్‌లలో ఒకటిగా నిలిచింది. అభిమానులతోపాటు విమర్శకుల నుండి అపారమైన ప్రశంసలను పొందింది. ఇప్పుడు రెండో పాట ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

ఇటీవల పుష్ప ది రూల్ చిత్రంలోని తొలి పాటను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల చేశారు. ఈ వీడియోలో పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ఒక చేతిలో టీ గ్లాసు పట్టుకుని స్టైల్ గా డాన్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఇది చాలా హైలెట్ అయింది.

ఇక పుష్ప ఐకానిక్ స్వాగ్ "తగ్గేదే లే (తలవంచను)" అంటూ చెంపై నుంచి చేతిని ఇచ్చే పోజు క్లిప్‌తో సాంగ్ ముగుస్తుంది. 'పుష్ప 1: ది రైజ్' చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కోసం మరోసారి కొత్త ట్రాక్స్ రూపొందించారు. పుష్ప: ది రైజ్ 2021 డిసెంబరులో విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా మాసీవ్ హిట్ అందుకుంది. అప్పటి నుండి ఈ సీక్వెల్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ 2021 సినిమాలో నటనకు గాను 2023లో జాతీయ అవార్డు అందుకున్నారు.

పుష్ప మొదటి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే పవర్ ఫైట్స్ ను చూపించారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 'పుష్ప 2'లో అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ వరుసగా పుష్ప రాజ్, శ్రీవల్లి, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది భాషలతో పాటు తెలుగులోనూ, హిందీలోనూ ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024