Raayan Box Office: హిట్ కొట్టిన ధనుష్ రాయన్- బ్రేక్ ఈవెన్ పూర్తి- కోటిన్నరకు పైగా లాభం- తెలుగులో మాత్రం!-raayan 7 days worldwide box office collection completes break even dhanush raayan 1 week box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raayan Box Office: హిట్ కొట్టిన ధనుష్ రాయన్- బ్రేక్ ఈవెన్ పూర్తి- కోటిన్నరకు పైగా లాభం- తెలుగులో మాత్రం!

Raayan Box Office: హిట్ కొట్టిన ధనుష్ రాయన్- బ్రేక్ ఈవెన్ పూర్తి- కోటిన్నరకు పైగా లాభం- తెలుగులో మాత్రం!

Sanjiv Kumar HT Telugu
Aug 02, 2024 01:23 PM IST

Raayan 7 Days Worldwide Box Office Collection: హీరో ధనుష్ కెరీర్‌‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే అర్జిస్తోంది. జూలై 27న రిలీజైన రాయన్ మూవీకి 7 రోజుల్లో అంటే వారంలో ఎంతవరకు కలెక్షన్స్ వసూలు అయ్యాయనే వివరాలు తెలుసుకుందాం.

హిట్ కొట్టిన ధనుష్ రాయన్- బ్రేక్ ఈవెన్ పూర్తి- కోటిన్నరకు పైగా లాభం- తెలుగులో మాత్రం!
హిట్ కొట్టిన ధనుష్ రాయన్- బ్రేక్ ఈవెన్ పూర్తి- కోటిన్నరకు పైగా లాభం- తెలుగులో మాత్రం!

Raayan 1 Week Box Office Collection: స్టార్ హీరో ధనుష్ సినీ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన 50వ సినిమా రాయన్. జూలై 27న విడుదలైన ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్ట్ చేసిన తొలి సినిమాగా రాయన్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది రాయన్ మూవీ.

yearly horoscope entry point

రాయన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వస్తున్నాయి. సినిమా రివేంజ్ డ్రామా అనే రొటీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ ధనుష్ టేకింగ్, యాక్టింగ్ అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాకు కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ రాయన్ మూవీ వారం రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా 7 డేస్ కంప్లీట్ చేసుకుని రన్ అవుతోంది.

రాయన్ మూవీకి ఇండియాలో 7వ రోజున రూ. 3.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వీటిలో తమిళం నుంచి రూ. 2.5 కోట్లు ఉండగా.. తెలుగు వెర్షన్‌కు రూ. 6 లక్షలు మాత్రమే వచ్చాయి. తెలుగు కంటే ఎక్కువగా హిందీ వెర్షన్‌కు మాత్రం రూ. 15 లక్షల కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అయితే, 6 రోజుతో పోలిస్తే 7వ రోజున రాయన్ కలెక్షన్స్ కాస్తా తగ్గాయి. 15.58 శాతం కలెక్షన్స్ ఏడో రోజున రాయన్‌ వసూళ్లు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక వారం రోజుల్లో భారతదేశంలో రాయన్ మూవీకి రూ. 60.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఈ కలెక్షన్లలో తమిళం నుంచి రూ. 51.05 కోట్లు వస్తే.. తెలుగు నుంచి మాత్రం రూ. 7.7 కోట్లు వసూలు అయ్యాయి. ఇక హిందీ నుంచి అతి తక్కువగా రూ. 1.35 కోట్లు వచ్చాయి. గత ఆరు రోజుల్లో రోజూవారీగా హిందీలోనే అన్నిటికంటే కలెక్షన్స్ తక్కువగా వచ్చేవి. కానీ, ఏడో రోజున మాత్రం హిందీలో ఎక్కువగా వచ్చి తెలుగులో తక్కువగా వచ్చాయి.

ఇకపోతే రాయన్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రూ. 47.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఫినీష్ చేసిన రాయన్ మూవీ లాభాలు అర్జించింది. రాయన్ సినిమాకు 7వ రోజుతో రూ. 1.80 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో రాయన్ సినిమా హిట్‌గా నిలిచింది. కానీ, తెలుగులో మాత్రం రాయన్ సినిమాకు ఇంకా రూ. 28 లక్షలు వస్తేనే హిట్‌గా నిలుస్తుంది.

రాయన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో 5.50 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రాయన్ సినిమాకు రూ. 5.22 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 5.50 కోట్లు కావాలంటే ఇంకా 28 లక్షలు రావాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ కూడా 8వ రోజున అంటే ఆగస్ట్ 2న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అయిన బుకింగ్స్ ప్రకారం రాయన్‌కు 8వ రోజున రూ. 34 లక్షలు కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ సంస్థలు.

Whats_app_banner