Kalki 2898 AD Box Office: రోజుకో కోటి కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ- హిందీలోనే భారీ కలెక్షన్స్- కోట్లల్లో లాభాలు!-kalki 2898 ad 36 days worldwide box office collection prabhas kalki day 36 box office collection kalki 2898 ad profit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Box Office: రోజుకో కోటి కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ- హిందీలోనే భారీ కలెక్షన్స్- కోట్లల్లో లాభాలు!

Kalki 2898 AD Box Office: రోజుకో కోటి కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ- హిందీలోనే భారీ కలెక్షన్స్- కోట్లల్లో లాభాలు!

Sanjiv Kumar HT Telugu
Aug 02, 2024 12:33 PM IST

Kalki 2898 AD 36 Days Worldwide Collection: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్వన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఇండియన్ మైథాలజీ సినిమా కల్కి 2898 ఏడీ ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద స్టేబుల్‌గా ప్రదర్శితం అవుతోంది. ఈ క్రమంలో కల్కి 36 డేస్ కలెక్షన్స్ వివరాలు చూస్తే..

రోజుకో కోటి కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ- హిందీలోనే భారీ కలెక్షన్స్- కోట్లల్లో లాభాలు!
రోజుకో కోటి కొల్లగొడుతున్న కల్కి 2898 ఏడీ- హిందీలోనే భారీ కలెక్షన్స్- కోట్లల్లో లాభాలు!

Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్వన్ తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తోపాటు పలువురు పాపులర్ డైరెక్టర్స్ కెమియోస్ చేసిన విషయం తెలిసిందే.

yearly horoscope entry point

రోజుకో కోటి రూపాయలు

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా విడుదలై నేటికి సక్సెస్‌ఫుల్‌గా రన్ కొనసాగిస్తోంది. కమల్ హాసన్ హీరోగా చేసిన ఇండియన్ 2 వంటి సినిమాలను సైతం పక్కన పెట్టి రోజుకు సుమారు కోటి రూపాయల కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే, కలెక్షన్లలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ నిలకడగానే తన లాంగ్ రన్ కొనసాగిస్తోంది కల్కి మూవీ.

హిందీలోనే భారీ కలెక్షన్స్

ఇక కల్కి 2898 ఏడీ మూవీ 36వ రోజున ఇండియాలో రూ. కోటి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో తెలుగు నుంచి రూ. 5 లక్షలు, తమిళం నుంచి 3 లక్షలు, హిందీ బెల్ట్ నుంచి అధికంగా రూ. 45 లక్షలు, కన్నడ, మలయాళం నుంచి చెరో లక్ష కలెక్షన్స్‌గా ఉన్నాయి. ఇలా చూసుకుంటే 36వ రోజున తెలుగు కంటే హిందీ వెర్షన్‌కే భారీ కలెక్షన్స్ వచ్చాయి.

5.26 శాతం పెరిగిన కలెక్షన్స్

అలాగే, 35వ రోజుతో పోల్చుకుంటే 36వ రోజున కల్కి కలెక్షన్స్ 5.26 శాతం పెరిగాయి. ఇక 36 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు రూ. 635.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇందులో తెలుగు నుంచి రూ. 283.64 కోట్లు, తమిళం నుంచి 35.89 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 286.64 కోట్లు, కన్నడ నుంచి 5.74 కోట్లు, మలయాళం నుంచి రూ. 24.04 కోట్లుగా ఉన్నాయి.

161 కోట్లకుపైగా ప్రాఫిట్

వీటిలో కూడా తెలుగు కంటే హిందీ నుంచే అధికంగా కలెక్షన్స్ కలెక్ట్ అయ్యాయి. టాలీవుడ్ హీరో అయిన ప్రభాస్‌కు తెలుగులో కంటే హిందీలో అధికంగా కలెక్షన్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ పోటీకు వచ్చిన కల్కి సినిమాకు ఇప్పటికీ రూ. 161.11 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా రికార్డు కొట్టింది.

36 రోజుల్లో

అంతేకాకుండా సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాకు 36 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1047.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

వందకే కల్కి టికెట్

ఇదిలా ఉంటే, తాజాగా కల్కి మేకర్స్ ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇండియాలోని ఏ థియేటర్లలోలైనా కల్కి 2898 ఏడీ సినిమాను కేవలం రూ. 100కే చూసే ఆఫర్ ప్రకటించారు. అది కూడా ఈ వారం మాత్రమే. ఆగస్ట్ 2 నుంచి ఆ ఆఫర్ వర్తిస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Whats_app_banner