Raayan Box Office: పడిపోయిన ధనుష్ రాయన్ కలెక్షన్స్- అయినా 107 కోట్ల వసూళ్లు- వారం కాకముందే ఆ రికార్డ్!-raayan 6 days worldwide box office collection surpassed 100 cr dhanush raayan day 6 box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raayan Box Office: పడిపోయిన ధనుష్ రాయన్ కలెక్షన్స్- అయినా 107 కోట్ల వసూళ్లు- వారం కాకముందే ఆ రికార్డ్!

Raayan Box Office: పడిపోయిన ధనుష్ రాయన్ కలెక్షన్స్- అయినా 107 కోట్ల వసూళ్లు- వారం కాకముందే ఆ రికార్డ్!

Sanjiv Kumar HT Telugu
Aug 01, 2024 03:48 PM IST

Raayan 6 Days Worldwide Box Office Collection: తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ దర్శకత్వం వహించిన సినిమా రాయన్. జూలై 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాయన్ సినిమాకు 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో చూస్తే..

ధనుష్ రాయన్ 6 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
ధనుష్ రాయన్ 6 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Raayan Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాయన్. సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్‌జే సూర్య, కాళీదాస్ జయరామ్, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ వంటి ప్రముఖులు నటించిన రాయన్ మూవీ జూలై 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

yearly horoscope entry point

అన్ని భాషలు కలిపి

పాజిటివ్ టాక్ మూలంగా రాయన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. రాయన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున రూ. 38 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కలుపుకుని రాయన్ మూవీకి ఇండియాలో రూ. 3.85 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

15.38 శాతం తగ్గిన కలెక్షన్స్

ఈ 3.85 కోట్లల్లో తమిళం నుంచి రూ. 3 కోట్లు, హిందీ నుంచి రూ. 15 లక్షలుగా ఉన్నాయి. అయితే, కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించుకున్నప్పటికీ ఆరో రోజున రాయన్ కలెక్షన్స్ తగ్గాయి. ఐదో రోజున వచ్చిన రూ. 4.55 కోట్లతో పోలిస్తే ఆరో రోజున రాయన్‌ మూవీకి 15.38 శాతం కలెక్షన్స్ పడిపోయాయి. ఇదిలా ఉంటే, ఇండియా వ్యాప్తంగా రాయన్ సినిమాకు రూ. 56.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

వంద కోట్లు దాటేసింది

ఈ కలెక్షన్స్‌లలో తమిళ వెర్షన్‌కు రూ. 48.55 కోట్లు, తెలుగు వెర్షన్‌కు రూ. 7.1 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. ఇలా రాయన్ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ. 93.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వంద కోట్లు దాటి రాయన్ హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లో చేరిపోయింది.

వారం కాకముందే

తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, కేరళ, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రాయన్ మూవీకి ఆరు రోజుల్లో రూ. 107 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. దీంతో 6 రోజుల్లోనే అంటే వారం కాకముందే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా రాయన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఒక్క రోజులోనే

ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్‌గా రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ధనుష్ 50వ మూవీ రాయన్‌కు ఇంకా ఒక కోటి రూపాయలు వస్తేనే ఆ లక్ష్యాన్ని ఛేదించినట్లు అవుతుంది. రాయన్‌కు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఇంకా ఒక్క రోజులోనే ఆ కోటి దాటేయగలదని తెలుస్తోంది. ఈ కోటి దాటిన తర్వాత రాయన్ మూవీకి వచ్చే కలెక్షన్నీ లాభాలుగా మారనున్నాయి. అలాగే తెలుగులో ఇంకో 56 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినీష్ అవుతుంది.

Whats_app_banner