Raayan Twitter Review: రాయన్ ట్విటర్ రివ్యూ.. హీరో ధనుష్ దర్శకత్వం చేసిన రివేంజ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Raayan Movie Twitter Review In Telugu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూలై 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాయన్ ట్విటర్ రివ్యూలోకి వెళితే..
Raayan Twitter Review In Telugu: నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో, కోలీవుడ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. ధనుష్ సినీ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్‌కు తనే దర్శకత్వం వహించారు. అంటే ధనుష్ హీరోగా, దర్శకుడిగా చేసిన తొలి మూవీ ఇదే.
సందీప్ కిషన్ కీ రోల్
ధనుష్ స్యీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్‌లో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, కాళిదాస్ జయరామ్, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన రాయన్ మూవీ ఇవాళ అంటే శుక్రవారం (జూలై 26) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సినిమా రిజల్ట్‌పై డౌట్స్
అయితే రాయన్ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ తెలుగులో అంతగా బజ్ క్రియేట్ కాలేదు. దాంతో సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు తలెత్తాయి. కానీ, దానికి భిన్నంగా రాయన్ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్స్, ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో రాయన్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
టాప్ నాచ్ డైరెక్షన్
"రాయన్ మూవీ రా అండ్ రస్టిక్‌గా ఉంది. ధనుష్ ట్రాన్సర్ఫమేషన్, స్క్రీన్ ప్రజెన్స్ ఫైర్ అంతే. అలాగే ధనుష్ డైరెక్షన్ టాప్ నాచ్‌గా ఉంది. వెట్రిమారన్‌ను గుర్తు చేశారనడంలో సందేహం లేదు. నటీనటులు పర్ఫామెన్స్ అదిరిపోయింది. ఎస్‌జే సూర్య యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ బీజీఎమ్ సినిమాకు బ్యాక్‌బోన్" అని రాయన్ ఫస్టాఫ్‌పై ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు.
"రాయన్ ఒక సాధారణ రివేంజ్ డ్రామా మూవీ. కానీ, డైరెక్టర్ ధనుష్ తన టేకింగ్‌తో కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ పోర్షన్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. ధనుష్ నటన పీక్స్‌లో ఉంది. కథకు ముఖ్యమైన పాత్రగా సందీప్ కిషన్ రోల్ ఉంది. ఫస్టాఫ్‌లో ఎస్‌జే సూర్య పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు. సెకండాఫ్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ ప్లాట్ ఫస్టాఫ్‌లో ఉంది" అని మరో ఎక్స్ యూజర్ కూడా రాయన్ ఫస్టాఫ్‌పై రివ్యూ ఇచ్చారు.
"రాయన్ ఇంటర్వెల్ అదిరిపోయింది. ధనుష్ ఇరగదీశాడు. అంతా బాగా సెట్ అయ్యాయి" అని చెబుతూ రాయన్‌పై రియాక్షన్‌లా ఓ మీమ్ టంప్లెట్ షేర్ చేశారు ఓ ట్విటర్ యూజర్.
"ఏఆర్ రెహమాన్ రాయన్ సినిమాకు సెకండ్ హీరో. బీజీఎమ్ మాములుగా లేదు" అని ఇంతకుముందు రివ్యూ ఇచ్చిన నెటిజనే మరోసారి ఇలా రాసుకొచ్చారు. అలాగే ఏఆర్ రెహమాన్ ఫొటోను రాయన్ మూవీ పోస్టర్‌తో షేర్ చేశారు.
ఇలా రాయన్ సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. పస్టాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని చెబుతున్నారు. అలాగే సెకండాఫ్ కూడా బాగుందని అంటున్నారు.
ఇక ధనుష్ ఎంట్రీ సూపర్బ్‌గా ఉందని ఓ నెటిజన్ తెలిపారు. క్లైమాక్స్ మాత్రం వావ్ అనేలా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుందని మరికొంతమంది చెబుతున్నారు.
టాపిక్