Samantha Bold: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!-samantha vs sobhita dhulipala more bold over engagement with naga chaitanya sobhita dhulipala family background ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Bold: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Samantha Bold: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Aug 08, 2024 11:58 AM IST

Sobhita Dhulipala More Bold Than Samantha: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే నిజమైతే త్వరలో నాగ చైతన్య పెళ్లి చేసుకునే శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు చూస్తే..

సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Samantha Vs Sobhita Dhulipala: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ టాపిక్ జోరుగా సాగుతోంది. దీనిలో ఎంతనిజముందో తెలియదు కానీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక త్వరలోనే నాగ చైతన్య, శోభిత పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు ఇరు కుటుంబాలు ఇవాళ (ఆగస్ట్ 8) ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోనున్నట్లు అక్కినేని కుటుంబానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు తెలిపినట్లు సమాచారం. అలాగే ఇవాళ సాయంత్రం నిశ్చితార్థం జరగనుందని టాక్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత టాపిక్ కూడా వైరల్ అవుతోంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య నాలుగేళ్లకు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు డివోర్స్ తీసుకోడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గానే మిగిలిపోయింది. విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ సమంత, నాగ చైతన్య సరైన సమాధానం చెప్పలేదు. ఈ సమయంలో సోషల్ మీడియాలో సమంతపై ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో అడల్ట్ సీన్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు ఓ కారణమని తెగ హైలెట్ అయింది. అప్పటివరకు సికిందర్ వంటి సినిమాల్లో సమంత బికినీతో హాట్ షో చేసినప్పటికీ ఇలాంటి ఇంటిమేట్ సీన్లలో సామ్ ఎప్పుడూ నటించలేదు. దాంతో ఆ సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్‌లోని సమంత ఇంటిమేట్ సీన్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది.

అలాగే సమంత ఇతరులతో సన్నిహితంగా ఉండటం, పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెప్పాలంటే సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని నెటిజన్ల కామెంట్స్ రూపంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

హిందీ మూవీ రమన్ రాఘవ్ 2.0తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శోభితా ధూళిపాళ మేడ్ ఇన్ హెవెన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో రెచ్చిపోయింది. ఇంటిమేట్ సీన్లతో రచ్చ చేసింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ది నైట్ మేనెజర్ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో యాక్ట్ చేసింది శోభిత. ఇదే కాకుండా ఇటీవల రిలీజైన ది మంకీ మ్యాన్ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది.

మరి ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య తనకంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ కామెంట్స్‌కు చెక్ పడాలంటే నాగ చైతన్య, శోభితా నిశ్చితార్థంపై అధికారికంగా స్పష్టం కావాల్సిందే.

కాగా శోభిత ధూళిపాళ ఏపీలోని తెనాలికీ చెందినది. 1992 మే 31న జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. విశాఖపట్నంలో పెరిగిన శోభితా 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చేసిన శోభితా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2010లో జరిగిన నేవీ వార్షిక వేడుకల్లో నేవీ క్వీన్‌ కిరీటం సాధించింది శోభిత.