Dhootha 2 OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా ధూత 2.. కన్ఫర్మ్ చేసిన నాగ చైతన్య!
Naga Chaitanya Dhootha 2 OTT Release: ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌గా విజయం సాధించింది ధూత. ఈ సిరీస్‌కు త్వరలో సీక్వెల్‌గా ధూత 2 రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా అక్కినేని నాగ చైతన్య కన్మర్మ్ చేసినట్లుగా ఆయన ట్వీట్ చెబుతోంది.

Naga Chaitanya Dhootha 2 OTT: అక్కినేని నట వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య ఓటీటీలోకి అడుగు పెట్టిన వెబ్ సిరీస్ ధూత. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ధూత సిరీస్‌కు ఓటీటీలో బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి ఓటీటీ ఎంట్రీతోనే నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టాడు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ జోనర్‌లో ఇన్వేస్టిగేటివ్ వంటి థ్రిల్లింగ్ సీన్లతో ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ధూత తెరకెక్కించారు. దాంతో సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ధూత వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరెక్కికంచారు. ఆయన ఇదివరకు నాగ చైతన్యతో మనం, 24, థ్యాంక్యూ చిత్రాలతోపాటు ఇష్క్, 13బి, సూర్య 24 సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. థ్యాంక్యూ మూవీ వంటి భారీ డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సిరీస్ మంచి హిట్‌గా నిలిచి ఇద్దరికీ పేరు తీసుకొచ్చింది. అయితే, ఈ సిరీస్‌కు సీక్వెల్ రావాలని ఓటీటీ లవర్స్, తెలుగు ఆడియెన్స్ ఎంతగానో కోరుకున్నారు.
కానీ, ధూత 2పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఇటీవల ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఆర్ యూ రేడీ" అనే ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఫ్యూచర్ సినిమాలు, సిరీస్‌లతో పాటు సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌లకు సంబంధించిన తర్వాత సీజన్స్‌లను కూడా ప్రకటించింది. అయితే ఈ జాబితాలో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు వెబ్ సిరీస్ ధూత సీజన్ 2 గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడంతో నాగ చైతన్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే, అనంతరం నాగ చైతన్య చేసిన ట్వీట్‌తో అక్కినేని అభిమానులు ఎంతగానో ఉత్సాహం చెందారు. నాగ చైతన్య తన ట్వీట్‌లో "ధూత సక్సెస్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇది చాలా సంతృప్తినిచ్చింది. మరిన్నింటి కోసం ఎదురు చూస్తున్నాను.. త్వరలో" అని రాసుకొస్తూ స్మైల్ ఎమోజీ షేర్ చేశాడు. దాంతో ధూతకు సీక్వెల్‌గా ధూత 2 సీజన్ ఉంటుందని, త్వరలో ఓటీటీలోకి వస్తుందని అభిమానులు, నెటిజన్స్ చాలా మంది నమ్ముతున్నారు.
ధూత 2 కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నాగ చైతన్య సీక్వెల్‌ను కన్ఫర్మ్ చేశాడని అంటున్నారు. అయితే, ధూత 2 సిరీస్‌పై టీమ్ లేదా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతవరకు ధూత 2పై కొంత సందిగ్ధత ఉన్నట్లే తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో గతేడాది డిసెంబర్ 1 నుంచి ధూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేశారు.
వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ధూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తొలి రోజు నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. సుమారు 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రతిక్షణం సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుందని ప్రశంసలు కురిపించారు. ఇక ధూత సిరీస్ ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అయింది. అక్కడ కూడా దీనికి మంచి రెస్పాన్స్ లభించింది.