Naga Chaitanya Sobhita Dhulipala: ఇవాళే నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున అధికారిక ప్రకటన?
Naga Chaitanya Sobhita Dhulipala Engagement Today: అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇవాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా అధికారికంగా ప్రకటించనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్‌తో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య ఏ మాయ చేశావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ మూవీతో హీరోగా నాగ చైతన్య, హీరోయిన్‌గా సమంత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
సమంతతో విడాకులు
అలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహబంధంలోకి వెళ్లింది. పెళ్లయిన నాలుగేళ్లకు విడాకులు తీసుకుంటున్నట్లు సమంత, నాగ చైతన్య ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి బిజీలో వాళ్లు ఉంటున్నారు. అయితే, సమంతతో విడాకుల అనంతరం హీరోయిన్ శోభితా ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు తెగ రూమర్స్ వినిపించాయి.
బంధువుల సమక్షంలో
చైతూ, శోభితా లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే, వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, తాజాగా నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఇవాళ అంటే ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో చాలా ప్రైవసీతో చైతూ శోభితా ఎంగేజ్‌మెంట్ జరగనుందని ఓ న్యూస్ తెగ హల్‌చల్ అవుతోంది.
స్వయంగా నాగార్జున
ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ సినీ వర్గాల్లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు శోభితా నుంచి గానీ, అక్కినేని ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, నాగ చైతన్య, శోభితా ఎంగేజ్‌మెంట్ అనంతరం అక్కినేని నాగార్జుననే స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది.
సాయంత్రలోపు
మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు గడిస్తే గానీ చెప్పలేం. అయితే, చైతూ శోభితా నిశ్చితార్థంపై నాగార్జున సాయంత్రంలోపు అనౌన్స్‌మెంట్ రావొచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
బోల్డ్ హీరోయిన్‌గా
కాగా శోభితా ధూళిపాళ గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీసుల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది శోభితా ధూళిపాళ.
తండేల్ మూవీ
ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న తండేల్ అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.