Mr Bachchan Bold Song: రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో సాంగ్ రిలీజ్- బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా జిక్కీ-bold and romantic melody song jikki released from mr bachchan ravi teja bhagyashri borse chemistry highlight ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Bold Song: రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో సాంగ్ రిలీజ్- బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా జిక్కీ

Mr Bachchan Bold Song: రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో సాంగ్ రిలీజ్- బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా జిక్కీ

Sanjiv Kumar HT Telugu
Aug 03, 2024 10:29 AM IST

Ravi Teja Mr Bachchan Jikki Song Released: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో లిరికల్ సాంగ్ జిక్కీ రిలీజ్ అయింది. బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ జిక్కీ పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హాట్ షో అదిరిపోయింది.

రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో సాంగ్ రిలీజ్- బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా జిక్కీ
రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో సాంగ్ రిలీజ్- బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా జిక్కీ

Mr Bachchan Bold Romantic Song Jikki: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా వస్తోన్న మిస్టర్ బచ్చన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చార్ట్ బస్టర్స్‌గా సాంగ్స్

ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు సాంగ్స్ అయితే ఇప్పటికే చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఆగస్ట్ 2న మిస్టర్ బచ్చన్ నుంచి థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

మోడరన్ అండ్ క్లాసిక్ టచ్‌

మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్‌ని కంపోజ్ చేశారు. సాంగ్‌లో మోడరన్ అండ్ క్లాసిక్ టచ్‌ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్‌ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్‌ని అందిస్తోంది. అలాగే పాటలోని లిరిక్స్ చాలా ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్‌తో ఎమోషన్‌ని, రొమాన్స్‌ను మిక్స్ చేసి సాహిత్యం అందించారు.

డైనమిక్ హిప్ మూవ్‌మెంట్స్

ఇక సింగర్స్ కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే సాంగ్ ఎసెన్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. అంతేకాకుండా జిక్కీ పాట విజువల్‌గా కూడా చాలా ఆకర్షిణీయంగా ఉంది. పాటలో రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటూనే హాట్‌గా కనువిందు చేసింది. పాటలో భాగ్యశ్రీ తన బ్యూటీతో డైనమిక్ హిప్ మూవ్‌మెంట్‌లతో అట్రాక్ట్ చేసింది.

ఎక్స్‌ట్రార్డినరీ కొరియోగ్రఫీ

అలాగే ఈ పాటలో విజువల్స్‌ స్టన్నింగ్‌గా ఉన్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. కాశ్మీర్ సీనిక్ బ్యూటీ గ్రేట్ అంథంటసిటీ యాడ్ చేసింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ రొమాంటిక్ మెలోడీ నిజంగా మ్యూజికల్ పారడైజ్‌లోకి తీసుకెళ్లేలా ఉంది.

శృంగారభరితంగా సీన్స్

జిక్కీ పాట రొమాంటిక్‌ అండ్ బోల్డ్‌గా సాగింది. రవితేజ, భాగ్యశ్రీ మధ్య సీన్స్ శృంగారభరితంగా ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యశ్రీ బోర్సే పాటలో హాట్ షోతో మెస్మరైజ్ చేసింది. పాట ప్రారంభం నుంచి చివరి వరకు బోల్డ్ షోతో యూత్‌ను తనవైపుకు తిప్పుకునేలా అందాలు ఆరబోసింది. ఈ పాట కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉందని తెలుస్తోంది.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా

ఇదిలా ఉంటే, మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ టాప్ క్లాస్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌‌గా వర్క్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.

కాగా మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సేతోపాటు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ వంటి నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.