CMAT 2025 : సీమ్యాట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ అప్లై చేయండి!
CMAT 2025 Registration : కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. అభ్యర్థులు 2024 డిసెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐఎంలు సహా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఎన్టీఏ పొడిగించింది. అభ్యర్థులు 2024 డిసెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు exam.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
మొదటి దరఖాస్తుకు చివరి తేదీని 13 డిసెంబర్ 2024 కాగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు 25 డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ డిసెంబర్ 25, సీమ్యాట్ 2025 కరెక్షన్ విండో డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 27 వరకు ఉంది.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)కి అనుబంధంగా ఉన్న సంస్థల్లో మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్షకు అభ్యర్థికి 3 గంటల 180 నిమిషాల సమయం ఇస్తారు. పరీక్ష షిఫ్ట్ సమయాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్ ఉంటుంది. పేపర్, స్కీమ్, టైమింగ్, అర్హత, ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో సీమ్యాట్ 2025 నోటిఫికేషన్ చూడవచ్చు. ఈ పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర మార్గాల ద్వారా సమర్పించిన దరఖాస్తు ఫారాలను స్వీకరించబోమని ఎన్టీఏ తెలిపింది.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన సమాచారాన్ని కచ్చితంగా పాటించాలని ఎన్టీఏ కోరింది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఇ-మెయిల్, చిరునామా, మొబైల్ నెంబరు సరైనవని ధృవీకరించుకోవాలని పేర్కొంది. ఎందుకంటే మొత్తం సమాచారం మీరు ఇచ్చిన వివరాల ఆధారంగానే చేస్తారు.
సీమ్యాట్ 2025కు దరఖాస్తు చేయడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్ 01140759000/69227700 లేదా cmat@nta.ac.in ఈ-మెయిల్లో సంప్రదించవచ్చు.
ఇలా అప్లై చేయండి
CMAT అధికారిక వెబ్‌సైట్‌ని exams.nta.ac.in/CMAT/ సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న CMAT 2025 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
పూర్తయిన తర్వాత పేజీకి లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.
సాధారణ పురుష అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, మహిళా అభ్యర్థులు రూ.1250 చెల్లించాలి. Gen-EWS/ SC/ST/PwD/OBC-(NCL) పురుష, స్త్రీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రుసుము రూ.1250గా నిర్ణయించారు. రుసుమును ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ exams.nta.ac.inకు వెళ్లవచ్చు.