Bhadrachalam Online Tickets: ఆన్‌లైన్‌లో భద్రాచలం రామాలయ ఉత్తరద్వార దర్శన టిక్కెట్లు
Bhadrachalam Online Tickets: భద్రాచలం రామాలయ ఉత్తర ద్వార దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 10న భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం పూజను నిర్వహిస్తారు. ఈ పూజల్లో 4వేల మందికి అవకాశం కల్పిస్తారు.
Bhadrachalam Online Tickets: భద్రాచలం రామాలయంలో నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31 నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 10న ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారదర్శం పూజ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు 4 వేల మందికి అవకాశం కల్పిస్తారు.
ఉత్తర ద్వార దర్శనం సెక్టార్ టికెట్లను భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఉత్తర ద్వార దర్శనం పూజల కోసం రూ.2 వేలు, రూ.1,000, రూ.500, రూ. 250 టికెట్లు విక్రయిస్తారు. 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఈ టిక్కెట్లను https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా జారీ చేస్తారు. భద్రాచలం రామాలయం వెబ్‌సైట్‌లో ఈ టిక్కెట్లను పొందవచ్చని ఈవోతెలిపారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి వైకుంఠ ఏకాదశి రోజున జరిగే పూజలను సెక్టార్లో కూర్చుని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొనలేని భక్తుల సౌకర్యార్థం పరోక్ష సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
పరోక్ష పూజల టిక్కెట్లను ఆన్లైన్లో పాటు, దేవాలయం వద్ద ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు ఒరిజినల్ టికెట్లను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10న ఉదయం 5 గంటల వరకు భద్రాచలం రామాలయ కార్యాలయంలో ప్రింట్ రూపంలో పొందాల్సి ఉంటుంది.