Dy CM Bhatti Vikramarka : భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు, డిసెంబర్ 28న ఖాతాల్లోకి డబ్బులు-భట్టి విక్రమార్క-dy cm bhatti vikramarka says landless poor receive 12k for year first phase in december 28th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dy Cm Bhatti Vikramarka : భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు, డిసెంబర్ 28న ఖాతాల్లోకి డబ్బులు-భట్టి విక్రమార్క

Dy CM Bhatti Vikramarka : భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు, డిసెంబర్ 28న ఖాతాల్లోకి డబ్బులు-భట్టి విక్రమార్క

Bandaru Satyaprasad HT Telugu
Dec 15, 2024 06:30 PM IST

Dy CM Bhatti Vikramarka : తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం మొదటి విడత నగదును డిసెంబర్ 28న జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు, డిసెంబర్ 28న ఖాతాల్లోకి డబ్బులు-భట్టి విక్రమార్క
భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు, డిసెంబర్ 28న ఖాతాల్లోకి డబ్బులు-భట్టి విక్రమార్క

Dy CM Bhatti Vikramarka : తెలంగాణ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12,000... రెండు వితడల్లో ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. డిసెంబర్ 28న తొలివిడత డబ్బులు జమచేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క...."తెల్లవాళ్ల నుంచి దేశానికి విముక్తిని కలిగించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ డిసెంబర్ 28. 1885. పేద ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ కాబట్టి...భూమి లేని ప్రజలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పాం. రెండు విడతల్లో ఈ డబ్బులు జమ చేస్తాం" అని అన్నారు.

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు

10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7,11,911 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపై భారం వేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టిందేం లేదన్నారు. లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్ పార్టీకి తెలుసన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకు ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రూ.21 వేల కోట్ల రుణమాఫీ

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం లేకుండానే గత ప్రాజెక్టులతో రికార్డు స్థాయిలో ధాన్యం పండుతుందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం...ఏడాది కాలంలోనే రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేసిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రుణ మాఫీ చేశామన్నారు. ఇప్పటికే రైతు భరోసా కింద రూ.7600 కోట్లు వేశామన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ కట్టని రూ.1514 కోట్ల బీమా కూడా కట్టామన్నారు. పదేళ్లలో పంట నష్టాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

రైతులకు రూ.50,953 కోట్లు

హైదరాబాద్‌లోని మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు 2014 నాటికి ఏడాదికి రూ.6,400 కోట్లు అప్పు ఉంటే...గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ఏడాదికి రూ.66,782 కోట్లు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ అందిస్తున్నామని, తద్వారా ప్రతి ఏకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రైతులకు అదనంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఏడాది కాలంలోనే రైతులకు నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చుచేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అనుసంధానిస్తూ రీజినల్‌ రింగ్‌ రోడ్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్, రీజినల్‌ రింగ్‌రోడ్‌ మధ్య ఇండస్ట్రియల్‌, హౌసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్‌, మధ్యాహ్న భోజనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.40,154 కోట్లు పెట్టిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం