Mango Farmers : మామిడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మామిడి పంటకు బీమా వర్తింపు- ఏడు ముఖ్యమైన అంశాలివే-ap govt good news to mango farmers insurance applied in mango fields ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mango Farmers : మామిడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మామిడి పంటకు బీమా వర్తింపు- ఏడు ముఖ్యమైన అంశాలివే

Mango Farmers : మామిడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మామిడి పంటకు బీమా వర్తింపు- ఏడు ముఖ్యమైన అంశాలివే

HT Telugu Desk HT Telugu
Dec 10, 2024 06:47 PM IST

Mango Farmers : ఏపీ ప్రభుత్వం మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మామిడి పంటకు బీమా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మామిడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మామిడి పంటకు బీమా వర్తింపు- ఏడు ముఖ్యమైన అంశాలివే
మామిడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మామిడి పంటకు బీమా వర్తింపు- ఏడు ముఖ్యమైన అంశాలివే

Mango Farmers : రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంట‌కు బీమా అమ‌లు చేయాలని నిర్ణయించింది. ఈ మేర‌కు బీమా వ‌ర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

yearly horoscope entry point

ఏడు ముఖ్యమైన అంశాలివే

1. 2024-25, 2025-26 సంవత్సరాల్లో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డ‌బ్ల్యూబీసీఐఎస్‌) అమలుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది.

2. ఖరీఫ్ సీజన్‌లో ఏడు పంటలు, రబీ సీజన్‌లో రెండు పంటలను ఈ బీమా కవర్ చేస్తుంది. రబీ సీజన్‌లో మామిడిని అదనపు పంటగా చేర్చడానికి పథకాన్ని విస్తరించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. మామిడి పంట‌కు పథకం అమలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నిర్దేశించిన విధానం ప్రకారం పూర్తి చేయాల‌ని సూచించింది.

3. 2024-25, 2025-26 సంవత్సరాల్లో రబీలో మామిడి పంటకు బీమా పథకం అమలుకు సంబంధించి పరిపాలనాపరమైన ఆమోదం ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

4. ఆ అభ్య‌ర్థ‌న‌ను నిశితంగా పరిశీలించిన తరువాత‌ 2024-25, 2025-26 సంవత్సరాల్లో రబీలో మామిడి పంటకు బీమా పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది.

5. ఈ పథకాన్ని రాష్ట్రంలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (4 క్లస్టర్లు-15 జిల్లాలు) అమలు చేస్తుంది.

6. రుణాలు తీసుకునే వారితో పాటు రుణం పొంద‌ని రైతుల‌కు స్వచ్ఛందంగా బీమా ప‌థ‌కం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది.

7. బీమా ప‌థ‌కం అమలకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకుంటారు.

స‌గ‌టు ప్రీమియం రేట్లు ఇలా

ఆర్‌డ‌బ్ల్యూబీసీఐఎస్ కింద మామిడి పంటకు ప్రీమియం రేట్లతో పాటు క్లస్టర్ వారీగా బీమా కంపెనీల కేటాయింపు ఇలా ఉంటుంది.

1. క్లస్టర్‌-1లో అనంత‌పురం ఒక్క‌ జిల్లానే ఉంది. అక్కడ‌ స‌గ‌టు ప్రీమియం రేటు 15 శాతం చొప్పున నిర్ణయించారు.

2. క్లస్టర్‌-2లో ఏడు జిల్లాలు ఉన్నాయి. ఎన్‌టీఆర్‌, కాకినాడ, వైఎస్ఆర్ క‌డ‌ప‌, అన్నమయ్య, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స‌గ‌టు ప్రీమియం రేటు 16.77 శాతం చొప్పున నిర్ణయించారు.

3. క్లస్టర్‌-3లో నాలుగు జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో స‌గ‌టు ప్రీమియం రేటు 17.74 శాతం చొప్పున నిర్ణయించారు.

4. క్లస్టర్‌-4లో మూడు జిల్లాలు ఉన్నాయి. నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో స‌గ‌టు ప్రీమియం రేటు 16.08 శాతం చొప్పున నిర్ణయించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner