ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ మీద మంచి తగ్గింపు.. ఇక టైమ్ వేస్ట్ చేయకుండా ఓ లుక్కేయండి!-realme narzo 70x 5g smartphone gets better discount know affordable price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ మీద మంచి తగ్గింపు.. ఇక టైమ్ వేస్ట్ చేయకుండా ఓ లుక్కేయండి!

ఈ రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ మీద మంచి తగ్గింపు.. ఇక టైమ్ వేస్ట్ చేయకుండా ఓ లుక్కేయండి!

Anand Sai HT Telugu
Dec 15, 2024 08:00 PM IST

Realme NARZO 70X 5G Discount : రియల్‌మీ ఫోన్లకు భారత్‌లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా ఈ కంపెనీ ఫోన్ తీసుకోవాలంటే మీకోసం గుడ్‌న్యూస్. రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్‌తో పొందవచ్చు.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ
రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ

భారతదేశంలో రియల్‌మీ మొబైల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ మీద ఆఫర్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం Realme NARZO 70x 5G భారీ ధర తగ్గింపును అందిస్తుంది. మంచి తగ్గింపులతో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి చూద్దాం..

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అమ్మతున్నారు. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో 22 శాతం తగ్గింపును ప్రకటించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 128జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ధర, ఆఫర్‌లు

4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ = రూ 12,500.

6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ = రూ 13,362.

8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ = రూ 18,999.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 12,500గా అందుబాటులో ఉంది. 26 శాతంతో డిస్కౌంట్‌తో ప్రస్తుతం దొరుకుతుంది. అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. మీరు దీన్ని ఫారెస్ట్ గ్రీన్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌లన్నింటినీ పొందండి.

రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ మొబైల్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali G57 జీపీయూని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో పనిచేస్తుంది. ర్యామ్‌ని పెంచడానికి డైనమిక్ సపోర్ట్ కూడా ఉంది.

డ్యూయల్ కెమెరా సెటప్‌తో రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ మొబైల్ వస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి, 45వాట్స్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం ఐపీ54 రేట్ ఉంది. ఇందులో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్, ఎయిర్ గెస్చర్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.

గమనిక : ప్రస్తుతం ఈ ఫోన్ మీద ఉన్న ఆఫర్ ఆధారంగా ఈ కథనం ఇచ్చాం. ఇది భవిష్యత్తులో మారవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుని కొనుగోలు చేయండి.

Whats_app_banner