360 Degree Camera Cars : సేఫ్టీ డ్రైవింగ్ కోసం బడ్జెట్ ధరలో 360 డిగ్రీ కెమెరాతో వచ్చే కార్లు
360 Degree Camera Cars : ఈ మధ్యకాలంలో మార్కెట్‌లోకి వచ్చే కార్లు అనేక ఫీచర్లతో ఉంటున్నాయి. అందులో 360 డిగ్రీ కెమెరా రావడం ఒకటి. చాలా మంది ఈ ఫీచర్ కోసం చూస్తుంటారు.
కార్లకు 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనితో డ్రైవింగ్, రివర్స్, రహదారిపై కారు పార్కింగ్ చాలా ఈజీ అవుతుంది. 360-డిగ్రీ కెమెరా ఫీచర్ సహాయంతో మీరు కారు చుట్టూ అనేక కోణాల నుండి చూడవచ్చు. ఇది ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. వాహన ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుంది. 360 డిగ్రీ కెమెరాతో 10 లక్షల బడ్జెట్‌లో వచ్చే లిస్ట్ చూద్దాం..
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మారుతి సుజుకి ఫ్రాంక్స్
బడ్జెట్ ధరలో వస్తున్న బెస్ట్ ఎస్‌యూవీగా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ఆల్ఫా వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. దీని ప్రారంభ ధర రూ.7.52 లక్షలు ఎక్స్-షోరూమ్. ఈ ఎస్‌యూవీ దాదాపు 28 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది. ఫ్రాంక్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360-డిగ్రీ కెమెరాతో రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లతో వస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ భారతీయ మార్కెట్‌లో ధర రూ. 7.79 లక్షల నుండి రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ దాని మిడ్ స్పెక్ ఏఎక్స్5ఎల్ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, డైరెక్ట్-ఇంజెక్షన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. . 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి ఇటీవల సరికొత్త డిజైర్ సెడాన్‌ను తీసుకొచ్చింది. పవర్‌ఫుల్ ఇంజన్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో ఈ సెడాన్ విడుదల అయింది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ.6.79 లక్షలు మాత్రమే. 360 డిగ్రీ కెమెరా ఫీచర్లు దాని మిడ్ స్పెక్ వేరియంట్‌తో మెుదలవుతాయి.
మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది 360 డిగ్రీల కెమెరా ఫీచర్ దాని ఆల్ఫా వేరియంట్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్లో బాలెనో ఆల్ఫా వేరియంట్ ధర రూ. 9.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మారుతి సుజుకి బాలెనో భారత్ మార్కెట్లో అప్‌డేట్ చేస్తూ విడుదల చేసింది. ఇందులో అనేక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ ఇటీవల మాగ్నైట్‌ను కొత్త వెర్షన్‌లో తీసుకొచ్చింది. ఈ కారులో పవర్‌ఫుల్ ఇంజన్, అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని మిడ్-స్పెక్ ఎక్స్‌వీ కురో ఎడిషన్ 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ వేరియంట్ ధర రూ. 8.28 లక్షలు ఎక్స్-షోరూమ్.